Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రికార్డు మిస్సయిన వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag
ముంబై: భారత క్రికెట్ జట్టు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొద్ది పరుగుల తేడాతో ప్రపంచ రికార్డును మిస్సయ్యాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో అతను ఈ రికార్డు మిస్సయ్యాడు. శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీథరన్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి 293 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను శుక్రవారం ఉదయం అవుటయ్యాడు. తద్వారా క్రికెట్ అభిమానులను నిరాశపరిచాడు. టెస్టు మ్యాచుల్లో మూడు ట్రిపుల్ సెంచరీ సాధించిన క్రికెటర్ గా రికార్డు సృష్టించడానికి అతనికి కేవలం 16 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా అతను శుక్రవారం బ్యాటింగ్ కు దిగాడు.



శతాబ్దం క్రితం టెస్టు మ్యాచుల్లో మూడు ట్రిపుల్ సెంచరీలు సాధించిన రికార్డు నమోదైంది. అయితే శుక్రవారం ఆశావహంగా బ్యాటింగ్ కు దిగిన సెహ్వాగ్ నాలుగో ఓవరులోని ట్రిపుల్ సెంచరీకి మరో ఏడు పరుగులు కావాల్సి ఉండగా అవుటయ్యాడు. గురువారం అతను 284 పరుగులు చేసి నాటవుట్ గా మిగిలాడు. కేవలం 239 బంతుల్లో 250 పరుగులు చేసి అత్యంత వేగంగా ఈ స్కోరు సాధించిన క్రికెటర్ గా సెహ్వాగ్ గురువారమే రికార్డు సృష్టించాడు. సెహ్వాగ్ స్కోరులో 40 ఫోర్లు, ఏడు సిక్స్ లు ఉన్నాయి. రాహుల్ ద్రవిడ్ కూడా 74 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్, వివియస్ లక్ష్మణ్ ఆడుతున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+