గాలె: శ్రీలంకతో జరుగుతున్న రెండో క్రికెట్ టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్ 329 పరుగులకు ఆలౌట్ అయింది. వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీతో భారత్ ఈ మాత్రం స్కోరు చేయగలింది. ఇన్నింగ్సు ముగిసే సమయానికి సెహ్వాగ్ 201 పరుగులు చేసి నాటవుట్ గా మిగిలాడు. సెహ్వాగ్ కు ఇది ఐదో డబుల్ సెంచరీ. శ్రీలంక బౌలర్ మెండిస్ మరోసారి భారత్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. 214 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తన ఇన్నింగ్సును ప్రారంభించిన భారత్ 329 పరుగులకు అలౌట్ అయింది. లక్షణ్ సెహ్వాగ్ కు తోడుగా నిలిచి కాస్తా నిలదొక్కుకున్నాడు. లక్ష్మణ్ 39 పరుగులు చేసి అవుటయ్యాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన దినేష్ కార్తిక్, కుంబ్లే, హర్బజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. సెహ్వాగ్, గౌతం గంభీర్ ఇచ్చిన అద్భుతమైన ప్రారంభాన్ని భారత బ్యాట్స్ మెన్ సద్వినియోగం చేసుకోలేకపోయారు. ద్రావిడ్, సచిన్, గంగూలీ ఇటు వచ్చి అటు వెళ్లిపోయారు. సెహ్వాగ్ ఒక్కడే ఇన్నింగ్స్ అంతా నిలబడ్డాడు. సెహ్వాగ్ కు టెస్టుల్లో ఇది మూడో డబుల్ సెంచరీ. శ్రీలంక బౌలర్లలో చామిండా వాస్, ముత్తయ్య మురళీధరన్ రెండేసి వికెట్లు తీసుకున్నాడు. భారత్ తొలి టెస్టు మ్యాచులో ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే.