For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup: ఆ ముఖాలు కూడా చూడటం ఇష్టం లేదు.. ప్రపంచకప్‌లో తేలిపోయిన సీనియర్లపై ఫైర్!

Sehwag dont want to see those senior players in next world cup

ప్రపంచకప్‌లో భారీ అంచనాలతో బరిలో దిగిన భారత జట్టు బోల్తాకొట్టింది. సెమీఫైనల్ వరకూ దూసుకెళ్లినా అతి ముఖ్యమైన సమయంలో చేతులెత్తేసింది. కప్పు మనదే అనుకుంటే కనీసం ఫైనల్ కూడా చేరలేమని, అదృష్టం కొద్దీ సెమీస్ చేరారని అనిపించుకుంటోంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కొన్ని ముఖాలను వచ్చే ప్రపంచకప్‌లో చూడదలచుకోలేదంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

2007 మోడల్...

2007 మోడల్...

కోట్లాది మంది అభిమానులు మనసులు ముక్కలయ్యేలా భారత జట్టు మరోసారి ప్రపంచకప్‌లో నిరాశ పరిచింది. దీనిపై స్పందించిన డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్.. భారత సెలెక్టర్లు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, 2007 ఫార్ములాను అనుసరించాలని సూచించాడు. బడా బడా ప్లేయర్లను కాకుండా ఒక కొత్త యువ జట్టును ఎంపిక చేయాలని, వారిపై ఎలాంటి అంచనాలు ఉండవు కాబట్టి కచ్చితంగా కప్పు కొడతారని చెప్పాడు.

ఆ మొఖాలు చూడాలని లేదు..

ఆ మొఖాలు చూడాలని లేదు..

జట్టు మైండ్ సెట్ గురించి తాను ఇప్పుడు మాట్లాడదలచుకోలేదని తెగేసి చెప్పాడు సెహ్వాగ్. తన మనసులో అనిపించింది దాచుకోకుండా చెప్పేసే అతను.. జట్టులో పెద్దగా ప్రదర్శన చేయని కొందరు సీనియర్ ఆటగాళ్ల మొఖాలు కూడా తాను వచ్చే ప్రపంచకప్‌లో చూడదలచుకోలేదన్నాడు. దీనిపై నిర్ణయం ఇప్పుడు ఉన్న సెలెక్షన్ కమిటీ తీసుకున్నా.. 2024 ప్రపంచకప్‌లో జట్టును ఎంపిక చేసే వాళ్లు, టీం మేనేజ్‌మెంట్ ఎలా ఆలోచిస్తారో చెప్పలేమన్నాడు.

వాళ్ల గురించేనా?

వాళ్ల గురించేనా?

ఈసారి ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, రాహుల్, అశ్విన్, షమీ తదితర వెటరన్ ఆటగాళ్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగా ఓపెనర్లు ఇద్దరూ జట్టుకు శుభారంభాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో వీళ్లపైనే సెహ్వాగ్ విమర్శలు చేశాడని అభిమానులు భావిస్తున్నారు. వీళ్ల పేర్లు చెప్పని సెహ్వాగ్ మాత్రం.. వచ్చే ప్రపంచకప్‌లో కూడా కానీ ఇదే జట్టుతో, ఇలాగే ఆడితే అప్పుడు ఫలితం కూడా ఇలాగే ఉంటుందని కరాఖండీగా చెప్పేశాడు.

Story first published: Saturday, November 12, 2022, 16:48 [IST]
Other articles published on Nov 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+