టీమిండియా బ్యాటింగ్‌ను ఏకి పడేసిన సెహ్వాగ్: అంత భయపడితే ఎట్లా?

లండన్: ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో వరుస విజయాలను నమోదు చేస్తోంది భారత క్రికెట్ జట్టు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ మినహా ఆడిన ప్రతీసారీ భారీ స్కోరును నమోదు చేస్తోంది. 250కి పైగా స్కోరును సాధిస్తూ వచ్చింది. అవేవీ- టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు సంతృప్తిని కలగనివ్వలేదు. భారత జట్టు బ్యాటింగ్‌ను ఆయన తూర్పారబట్టారు. ఏకి పడేశారు. దీనికి ప్రధాన కారణం.. బ్యాట్స్‌మెన్లు స్పిన్ బౌలింగ్‌లో మందకొడిగా ఆడటమే. ఈ ఒక్క కారణం- వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహానికి కారణమైంది. దీనిపై లెక్కలు తీసి మరీ.. ఆయన విమర్శలు సంధించారు.

ఆ రెండు మ్యాచుల్లోనూ అంతే..
నిజానికి భారత బ్యాట్స్‌మెన్లు స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. స్పిన్ బౌలింగ్‌లో భారీగా పరుగులను పిండుకోగలరు. స్వీప్ షాట్లతో ఎదురుదాడి చేయగల సామర్థ్యం భారత బ్యాటింగ్ లైనప్‌కు ఉంది. ప్రపంచకప్‌లో భారత జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోనూ స్పిన్నర్లదే పైచేయి. సౌతాంప్టన్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు స్కోరు బోర్డును పరుగులెత్తించలేకపోయారు. తమ స్థాయికి తగ్గట్టుగా స్పిన్ బౌలింగ్‌ను ఆడలేకపోయారనేది నిజం. రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్‌ల బౌలింగ్ గణాంకాలను చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది.
రషీద్ ఖాన్‌పై ఎదురు దాడి చేయలేక..
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా 50 ఓవర్లకు 224 పరుగులను మాత్రమే చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం రషీద్ ఖాన్, ముజీబుర్ రెహమాన్. రషీద్ ఖాన్ తొలి నాలుగు ఓవర్లలో భారత బ్యాట్స్‌మెన్లు 25 పరుగులు రాబట్టుకున్నారు. కాస్త ఫర్వాలేదనిపించుకున్నారు. సెకెండ్ స్పెల్‌లో మాత్రం రషీద్ ఖాన్ చేతి నుంచి గింగిరాలు తిరుగుతూ వచ్చిన బంతులను ఎదుర్కోవడం టీమిండియా బ్యాట్స్‌మెన్ల చేత కాలేదనే అనుకోవాలి. ఎందుకంటే- తన చివరి ఆరు ఓవర్లలో రషీద్ ఖాన్ కేవలం 13 మాత్రమే ఇచ్చుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే.. స్పిన్ బౌలింగ్‌లో మనవాళ్లు బ్యాట్లు ఎత్తేశారనేది స్పష్టమౌతోంది.

విండీస్ మ్యాచ్‌లోనూ అంతే..
ఇదే పరిస్థితి మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఎదురైంది. ఫ్యాబియన్ అలెన్ వేసిన స్లో బాల్స్‌ను ఆడటం టీమిండియా బ్యాట్స్‌మెన్ల వల్ల కాలేదు. తొలి అయిదు ఓవర్లలో 34 పరుగులును ధారళంగా సమర్పించుకున్న అలెన్.. తన చివరి అయిదు ఓవర్లలో ఇచ్చుకున్నది 18 పరుగులే. స్పిన్ గానీ, స్లో పేస్ బౌలింగ్ గానీ ఎదురు పడితే మనవాళ్లు రక్షణాత్మక ధోరణికి దిగిపోతున్నారనేది ఇక్కడ కనిపిస్తోంది. ఇదే విషయాన్ని వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నిస్తున్నాడు. స్పిన్ బౌలింగ్‌లో ఇంతగా రక్షణాత్మక బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉందా? అని ఆయన నిలదీస్తున్నారు. వరుసగా రెండు మ్యాచుల్లో స్పిన్‌ను ఎదుర్కోవడంలో డిఫెన్సివ్ బ్యాటింగ్ చేయడం జట్టుకు శుభపరిణామం కాదని ఆయన హెచ్చరిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications