డిక్షనరీలో పదాలు లేవు: ట్విట్టర్‌లో సెహ్వాగ్ తొలిసారి అసహనం
హైదరాబాద్: ట్విట్టర్ కింగ్‌గా పేరొందిన టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తొలిసారి అసహనానికి లోనయ్యాడు. ఆదివారం కుల్గాం జిల్లాలో హిజ్బుల్ ముజాహిదిన్ మిలిటెంట్లతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు రఘుబీర్ సింగ్, బందోరియా గోపాల్ సింగ్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన ఇద్దరు జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని సెహ్వాగ్ తన ట్విటర్ ఖాతాలో నివాళులర్పించారు. వారిద్దరూ ఫోటోలతో కూడిన ట్వీట్‌ను పోస్టు చేశాడు.
సెహ్వాగ్ ట్వీట్‌పై కొంతమంది కాశ్మీర్ యువకులు స్పందించారు. 'నేను కశ్మీర్‌కి చెందినవాడిని. వాస్తవాధీన రేఖను తొలగించండి అని గర్వంగా, బిగ్గరగా చెప్తాను' అని మహ్మద్ ఉమెర్ అనే యువకుడు తన ఖాతా ద్వారా ట్వీట్ చేసి ఆ ట్వీట్‌ను సెహ్వాగ్ ట్విట్టర్‌కు ట్యాగ్ చేశాడు.

ఆ తర్వాత మరోసారి 'రెండు కుక్కలు నరకానికి చేరాయి' అని ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఇలా మరికొంత మంది యువకులు సెహ్వాగ్ ట్వీట్‌ను అపహాస్యం చేస్తూ పలు ట్వీట్లు చేశారు. ఇలా కాశ్మీర్ యువత చేసిన వ్యాఖ్యలపై సెహ్వాగ్ కూడా ఘాటుగానే స్పందించాడు.
'మీలాంటి వాళ్లను వర్ణించాలంటే డిక్షనరీలో పదాలు లేవు. మీరు తొందరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తానని' సెహ్వాగ్ సమాధానమిచ్చాడు. అయితే ఏమైందో ఏమో గానీ ఆ తర్వాత మహ్మద్ ఉమెర్ తన ట్వీట్లను ఖాతా నుంచి డిలీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications