అరుదైన గౌరవం: ఫిరోజ్ షా కోట్లాలో వీరేంద్ర సెహ్వాగ్ గేట్ ఇదే
హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలోని ఓ గేట్‌కు సెహ్వాగ్ పేరు పెట్టారు. బుధవారం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఈ గేట్‌ని సెహ్వాగ్ చేత ప్రారంభోత్సవం చేయించింది.
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం తొలి టీ20 ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీడీసీఏ సెహ్వాగ్ గేట్‌ని మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా గేట్ దగ్గర సెహ్వాగ్ సాధించిన రికార్డులను, విజయాలను పొందుపరిచింది.

చిన్న తప్పిదం
అయితే ఇక్కడ చిన్న తప్పిదం చోటుచేసుకుంది. టెస్టు క్రికెట్‌లో భారత్ తరుపున ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెట్ సెహ్వాగ్ అంటూ రాసుకొచ్చింది. గతేడాది కరుణ్ నాయర్ చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన విషయాన్ని డీడీసీఏ మరచిపోయినట్లుంది. అయితే ఈ తప్పిదానికి ఎవరు కారణం అన్నది మాత్రం తెలియరాలేదు.

ఈ గేట్‌ను చూస్తూ లోపలికి వెళ్లేవాడిని
అనంతరం సెహ్వాగ్ మాట్లాడుతూ 'నేను చిన్నతనంలో క్రికెట్ ఆడటానికి ఇక్కడికి వచ్చినపుడు ఈ గేట్‌ను చూస్తూ లోపలికి వెళ్లేవాడిని. ఇప్పుడిదే గేట్‌కు నా పేరు పెట్టారు. నాకు దక్కిన గొప్ప గౌరవం. క్రికెటర్‌గా మారిన తర్వాత నా పేరును గేటుకు పెట్టారు. భవిష్యత్తులో డ్రస్సింగ్ రూమ్, స్టాండ్స్, తదితరాలపై కూడా నా పేరు కనిపించొచ్చు. ఈ రాష్ట్రం నుంచి ఇంకా ఎందరో ప్లేయర్స్ దీనికి అర్హులైనా నా పేరు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గౌరవం ఇచ్చినందుకు డీడీసీఏకు థ్యాంక్స్' అని సెహ్వాగ్ చెప్పాడు.
గేట్ యువ క్రికెటర్లలో స్పూర్తి నింపాలి
ఈ గేట్ యువ క్రికెటర్లలో స్పూర్తి నింపాలని సెహ్వాగ్ ఆకాంక్షించాడు. 'నా చిన్నతనం నుంచి ఈ మైదానంలో ఎంతో క్రికెట్ ఆడాను. నాలాగే అండర్-16, అండర్-19, అండర్-23, రంజీ ట్రోఫీ ఆడి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నాను. ఆ తర్వాత ద్వారం, స్టాండ్‌పై పేరు రాయించుకోవాలి' అని సెహ్వాగ్ అన్నాడు. ఈ గేట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు భారత జట్టు సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సెహ్వాగ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సెహ్వాగ్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
గౌరవంగా భావిస్తున్నా
కాగా, చిన్నప్పుడు తాను క్రికెట్ నేర్చుకున్న స్టేడియంలో గేట్‌కు తన పేరు పెట్టడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు సెహ్వాగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అనంతరం నెహ్రా రిటైర్మెంట్ గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘ఈ రోజు నాది. దీని గురించి మాట్లాడుకుందాం. నెహ్రాపై రేపు మాట్లాడతా' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications