హైదరాబాద్: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్‌లో తనదైన ట్వీట్లతో అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే.
తన సహచర క్రికెటర్లకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడంలో తనదైశ శైలిని ప్రదర్శించే సెహ్వాగ్ గురువారం తన పుత్రోత్సాహాన్ని అభిమానులతో పంచుకున్నారు. పిల్లలు తండ్రి నుంచి ఎలాంటి సలహాలు తీసుకోకుండానే వారిని అనుసరిస్తారనే కామెంట్‌తో ట్విట్టర్‌లో ఓ ఫోటో పోస్టు చేశాడు.

అందులో ఒక ఫొటో సెహ్వాగ్ చిన్ననాటి ఫొటో కాగా మరొకటి తన కుమారుడి ఆర్వవీర్ సెహ్వాగ్ ఫొటో. దానిని గురించి అభిమానులకు వివరిస్తూ మొదటి ఫొటోలో ఉన్నది వీరేంద్ర సెహ్వాగ్, రెండో ఫొటోలో ఉన్నది ఆర్యవీర్ సెహ్వాగ్ అని తెలిపాడు.
'ప్రతి తండ్రి ఒకటి తప్పక గుర్తుంచుకోవాలి. ఏదో ఒక రోజు తన కుమారుడు తనని అనుసరిస్తాడు. అది కూడా తండ్రి నుంచి సలహా తీసుకోకుండానే' అని సెహ్వాగ్ కామెంట్‌ని పోస్టు చేశాడు. ఈ ఫోటోలో ఆర్యవీర్ అచ్చం సెహ్వాగ్‌లా నల్ల కళ్లజోడు పెట్టుకుని నిల్చుని ఫోటోకు ఫోజిచ్చాడు.