ఫోటోలు వైరల్: ఇండియన్ గర్ల్‌తో మ్యాక్స్‌వెల్ డేటింగ్!

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ భారత యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమె పేరు విని రామన్. ఆస్ట్రేలియా స్థిరపడిన భారత సంతతి కుటుంబానికి చెందిన అమ్మాయి. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మ్యాక్స్‌వెల్ గనుక విని రామన్ పెళ్లాడితే భారత అమ్మాయిని పెళ్లాడిన ఆసీస్ రెండో క్రికెటర్‌గా నిలుస్తాడు. గతంలో ఆస్ట్రేలియా పేసర్ షాన్ టైట్ భారత యువతినే పెళ్లాడాడు. ఐపీఎల్ 2014 సమయంలో ఓ వేడుకలో పరిచయమైన మషూమ్ సింఘా ప్రేమలో పడ్డాడు.
ఆ తర్వాత వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు భారత్‌లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. గత ఐపీఎల్ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో లాంక్‌షైర్ తరఫున ఆడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications