శీతల్‌తో ఊతప్ప, శ్రద్ధాతో ధవల్ పెళ్లి (పిక్చర్స్)
ఢిల్లీ: భారత క్రికెటర్ల పెళ్లి సందడి కొనసాగుతోంది. గురువారం నాడు ఇద్దరు క్రికెటర్లు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. రాబిన్ ఉతప్ప.. తన ప్రియురాలు, టెన్నిస్ క్రీడాకారిణి శీతల్ గౌతమ్‌ను పెళ్లి చేసుకున్నాడు.
మరోవైపు శ్రద్ధ ఖర్పుడెను పేసర్ ధవళ్ కుల్‌కర్ణి పెళ్లి చేసుకున్నాడు. ఫ్యాషన్ కోఆర్డినేటర్ అయిన శ్రద్ధతో ధవల్‌కు గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. వీళ్లిద్దరూ మరాఠీ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు.

ఇటీవలే క్రికెటర్ వరున్ అరోణ్ పెళ్లి జరిగింది. ఇప్పుడు ఊతప్ప, ధవల్‌లు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఊతప్ప ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఓపెనర్. ఊతప్ప పెళ్లి నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్, బాలీవుడ్ నటి జూహీ చావ్లాలు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ట్విట్టర్ ద్వారా ధవల్ కులకర్ణి - శ్రద్ధాల పెళ్లి నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications