Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫొటోలు: కోలుకుంటున్న కోహ్లీని బెంగళూరులో కలిసిన అనుష్క

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరిస్‌లో కోహ్లీ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో భుజం గాయంతో బాధపడుతున్న కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమయిర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌లో మొదటి వారానికి దూరమైన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి స్ధానంలో తాత్కాలిక కెప్టెన్‌గా షేన్ వాట్సన్ నాయకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఐపీఎల్‌లో ఆడాలని కోహ్లీ భావిస్తున్నాడు.

ఇదిలా ఉంటే బెంగళూరులో కోలుకుంటున్న కోహ్లీని ఆయన ప్రియురాలు, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ పరామర్శించారు. బెంగళూరుకు వచ్చిన కోహ్లిని అనుష్క కలుసుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తున్నాయి. వచ్చే వారం నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లలో కోహ్లీ ఆడనున్నాడు.

ఈ క్రమంలో కోహ్లీని ఉత్సాహపరచడానికి అనుష్క వచ్చినట్టు తెలుస్తోంది. అంతకముందు కోహ్లీ ఆడే ప్రతి మ్యాచ్‌కు దాదాపు అనుష్క హాజరయ్యేది. అయితే ఆమె మ్యాచ్‌లకు హాజరవుతుండటం వల్లే కోహ్లీ బాగా ఆడటం లేదని గతేడాది సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆమెను కించపరుస్తూ ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే.

అనుష్క శర్మపై నెజిటన్లు ట్వీట్స్ చేయడాన్ని కోహ్లీ సైతం తప్పుబట్టాడు. అప్పట్లో కోహ్లీ చేసిన ఆ ట్వీట్ 2016 సంవత్సరానికి గాను గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+