Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు వైరల్: బోనీ కపూర్ కుటుంబాన్ని పరామర్శించిన కోహ్లీ, అనుష్క

See Pics: Anushka Sharma, Virat Kohli visit Boney Kapoor to offer condolences for Sridevi's death

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మతో కలిసి బోనీ కపూర్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. గత వారం శ్రీదేవి దుబాయిలోని ఓ హోటల్ గదిలోని బాత్‌టబ్‌లో పడి మృతిచెందిన సంగతి తెలిసిందే. భార్య మరణంతో దుఃఖంలో ఉన్న బోనీ కపూర్‌ను కోహ్లీ దంపతులు ఆదివారం కలిసి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భోపాల్‌లో సినిమా షూటింగ్‌లో

భోపాల్‌లో సినిమా షూటింగ్‌లో

శ్రీదేవి మృతి చెందిన సమయంలో అనుష్క శర్మ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సినిమా షూటింగ్‌లో ఉండిపోయింది. దీంతో ఆదివారం భోపాల్ నుంచి ముంబైకి చేరుకున్న అనుష్క శర్మను విరాట్ కోహ్లీ స్వయంగా ఎయిర్‌పోర్టుకి వెళ్లి రిసీవ్‌ చేసుకున్నాడు. కారు ఎక్కగానే విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మ ఒకరినొకరు ప్రేమతో హత్తుకున్నారు.

బోనీ కపూర్ ఇంటికి వెళ్లి పరామర్శ

బోనీ కపూర్ ఇంటికి వెళ్లి పరామర్శ

ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని తిరిగి భారత్‌ చేరుకున్న కోహ్లీ ఆదివారం సాయంత్రం తన భార్య అనుష్క శర్మతో కలిసి బోనీ కపూర్‌ ఇంటికి వెళ్లి పరామర్శించారు. శ్రీదేవి మరణించిన సమయంలో కోహ్లీ సైతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు.

ట్విట్టర్‌లో అనుష్క శర్మ సంతాపం

ట్విట్టర్‌లో అనుష్క శర్మ సంతాపం

దీంతో ఆదివారం భోపాల్ నుంచి ముంబై చేరుకున్న అనుష్క శర్మతో కోహ్లీ నేరుగా లోఖండ్‌వాలాలోని శ్రీదేవి నివాసానికి వెళ్లారు. శ్రీదేవీ మరణవార్త వినగానే అనుష్క ట్విటర్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో విరుష్క జోడి ఇచ్చిన వివాహ రిసెష్షన్‌కు శ్రీదేవీ, బోనీ కపూర్ దంపతులిద్దరూ హాజరైన సంగతి తెలిసిందే.

 ముక్కోణపు టీ20 సిరిస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి

ముక్కోణపు టీ20 సిరిస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి

మరోవైపు శ్రీలంక వేదికగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ముక్కోణపు టీ20 సిరిస్ నుంచి సెలక్టర్లు కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరిస్‌కు కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. టోర్నీలో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్ మంగళవారం ప్రారంభం కానుంది. ఫైనల్‌తో సహా అన్ని మ్యాచ్‌లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి.

Story first published: Monday, March 5, 2018, 14:43 [IST]
Other articles published on Mar 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+