
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ దక్షిణాఫ్రికా పర్యటనను ఎంతగానో ఆస్వాదిస్తోంది. మైదానంలో టీమిండియాను కోహ్లీ సారథ్యం వహిస్తుంటే... మైదానం బయట ఆటగాళ్ల భార్యల గ్యాంగ్‌కు అనుష్క శర్మ కెప్టెన్‌గా వ్యవహారిస్తోంది. డిసెంబర్ 11న పెళ్లి అనంతరం కోహ్లీతో అనుష్క శర్మ దక్షిణాఫ్రికా బయల్దేరిన సంగతి తెలిసిందే.
కోహ్లీతో పాటు, కొత్తగా పెళ్లైన భువనేశ్వర్ సైతం తన భార్య నుపూర్ కౌర్‌ను తీసుకొచ్చాడు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు కూడా తమ భార్యలను దక్షిణాఫ్రికా తీసుకొచ్చారు. కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో జట్టులోని ఆటగాళ్లు పరుగులు చేసేందుకు నానాతంటాలు పడుతుంటే... గ్యాలరీల్లో వీళ్లు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
సెల్ఫీలు దిగుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకుంటూ హ్యాపీగా గడిపేస్తున్నారు. అనుష్కతోపాటు ధావన్ భార్య ఆయేషా, రోహిత్ భార్య రితిక, భువనేశ్వర్ భార్య నుపుర్ గ్యాలరీల్లో కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షూటింగ్‌లో పాల్గొనేందుకు అనుష్క భారత్ రానున్న నేపథ్యంలో ధావన్ భార్య అయేషా 'మా ట్రైనింగ్ పార్టనర్‌ను చాలా మిస్సవుతున్నాం' అనే క్యాఫ్షన్‌తో ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది.