పుట్టినరోజు నాడు ఇషాంత్ ట్రైనర్ ఎవరో బయట పెట్టిన సెహ్వాగ్
హైదరాబాద్: టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ శనివారం 29వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు ఇషాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఇషాంత్ శర్మ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
బెంగళూరు వేదికగా చిన్నసామి స్టేడియంలో జరిగిన ఈ టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ని చూస్తూ పెట్టిన ముఖకవళికలు భారత సగటు అభిమానికి ఎంతగానో నచ్చింది. అప్పట్లో ఇషాంత్ శర్మని అనుకరిస్తూ అంఫైర్లు సైతం పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇషాంత్ శర్మ పుట్టినరోజు నాడు సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. 1840లో లేడీ విక్టోరియా తన చిత్రమైన ముఖకవళికతో ఉన్న ఫోటోని జత చేసిన సెహ్వాగ్, నీ ట్రైనర్ ఎవరో తెలిసిందంటూ చమత్కరించాడు. 'హ్యాపీ బర్త్‌డే ఇషాంత్. ఎట్టకేలకు నీకు శిక్షణ ఇచ్చింది ఎవరో తెలుసుకున్నాను. ఎల్లప్పుడూ ఇలాగే ఎంటర్‌టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా: సెహ్వాగ్
ఇదిలా ఉంటే సెహ్వాగ్‌తో పాటు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా తదితరులు ఇషాంత్ శర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications