న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇదే తొలిసారి కాదు: వివాహ బంధంతో ఒక్కటైన మహిళా క్రికెటర్లు

See Pic: Two Women Cricketers From Australia, New Zealand Tie The Knot

హైదరాబాద్: వివాహా బంధంతో ఒక్కటయ్యారు ఆస్టేలియా, న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు. అదేంటి మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం ఏంటని అనుకుంటున్నారా? అవును నిజమే. న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ హేలీ జెన్సెన్-ఆసీస్ అన్‌క్యాప్‌డ్ విమెన్ క్రికెటర్ నికోలా హన్‌‌కాక్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వారం రోజుల క్రితం

వారం రోజుల క్రితం ఈ క్రికెట్‌ జంట వివాహ బంధంతో ఒక్కటి అయినట్లు నికోలా ప్రాతినిథ్యం వహిస్తోన్న మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. "గత వారం తన భాగస్వామి హేలీ జెన్సెన్‌ను పెళ్లాడిన మా స్టార్‌ బౌలర్‌ నికోలా హన్‌‌కాక్‌కు టీమ్‌గ్రీన్‌ తరఫున అభినందనలు" అంటూ వీరిద్దరి ఫోటోను అభిమానులతో పంచుకుంది.

న్యూజిలాండ్ జట్టులో ఆల్‌రౌండర్‌గా

న్యూజిలాండ్ జట్టులో ఆల్‌రౌండర్‌గా

2014లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జెన్సెన్ న్యూజిలాండ్ జట్టులో ఆల్‌రౌండర్‌గా ఎదిగారు. 2015లో జరిగిన ఓ మ్యాచ్‌లో 122 పరుగులు చేసి మహిళల క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించింది. విక్టోరియా మహిళల ప్రీమియర్‌ క్రికెట్‌ కాంపిటేషన్ సీజన్‌ 2017-18లో ఉనా పైస్లీ మెడల్‌ సొంతం చేసుకుంది.

‘మెల్‌బోర్న్ స్టార్స్'కు ప్రాతినిధ్యం

‘మెల్‌బోర్న్ స్టార్స్'కు ప్రాతినిధ్యం

బిగ్‌బాష్ లీగ్‌లోని తొలి రెండు సీజన్లలో జెన్సన్ ‘మెల్‌బోర్న్ స్టార్స్'కు ప్రాతినిధ్యం వహించింది. కాగా, మూడో ఎడిషన్‌లో మెల్‌బోర్న్ రెనెగడెస్‌కు మారింది. ఇక, ఆమె జీవిత భాగస్వామి హాన్‌కాక్‌ మహిళా బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆగస్టు 19, 2013 నుంచి న్యూజిలాండ్‌లో స్వలింగ వివాహాలు చట్టబద్ధమయ్యాయి.

ఇదే తొలిసారి కాదు

ఇదే తొలిసారి కాదు

ఇందులో భాగంగానే ఈ క్రికెటర్లు ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ లెస్బియన్‌ జంట పెళ్లి చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ డేన్ వ్యాన్ నీకెర్క్ ఆల్‌రౌండర్‌ మరిజాన్‌ కాప్‌ గతేడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Story first published: Friday, April 19, 2019, 14:18 [IST]
Other articles published on Apr 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X