
హైదరాబాద్: న్యూఢిల్లీలో గురువారం CNN-IBN Indian of the Year 2017 అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో పాటు పలు రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో నటి రమ్యకష్ణ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు కూడా సందడి చేశారు. బాహుబలి సినిమాలోని శివగామి పాత్రకు రమ్యకృష్ణకు, 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' గా కోహ్లీలు అవార్డులు అందుకున్నారు. ఈ వేదికపై కోహ్లీతో కలిసి దిగిన ఫోటోను రమ్యకృష్ణ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
'విరాట్ చాలా మంచి వ్యక్తి, ఆయన్ను కలుసుకోవడం చాలా సంతోషంగా' ఉందని రమ్యకృష్ణ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అయ్యింది. ప్రస్తుతం రమ్యకృష్ణ తెలుగులో 'హలో' చిత్రంతో పాటు తమిళంలో సూర్య హీరోగా 'తాన సేరందకూటం' అనే సినిమాలో నటిస్తున్నారు.