తండ్రిగా మారిన రోహిత్ శర్మ: పాపతో దిగిన తొలి ఫొటో ట్విట్టర్లో


హైదరాబాద్: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాడు. రోహిత్ భార్య రితికా డిసెంబర్ 30న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన రోహిత్ శర్మ తన పాపను చూసేందుకు మెల్‌బోర్న్ టెస్ట్ ముగిసిన వెంటనే భారత్‌కు తిరుగు పయనమయ్యాడు.
దీంతో సిడ్నీ టెస్టుకు సైతం రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఈ క్రమంలో తండ్రిగా మారిన రోహిత్ శర్మ తన పాపతో దిగిన తొలి ఫొటోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన ఐదురోజుల్లోనే ఆ చిట్టితల్లి అమ్మానాన్నల చేతి వేళ్లు పట్టేసుకుంది.
'హెలో వరల్డ్.. 2019 మనందరికీ బాగుండాలి' అని రోహిత్ శర్మ కామెంట్ పెట్టాడు. ఈ ఫొటోపై లైకుల వర్షం కురిపిస్తున్న రోహిత్ అభిమానులు 'భయ్యా మీ పాపాయికి రోహిక అనే పేరు పెడితే బాగుంటుంది' అంటూ సలహాలు ఇస్తున్నారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం జనవరి 8న రోహిత్ శర్మ తిరిగి జట్టుతో చేరతాడు. రితికాను 2015 డిసెంబర్ 13న రోహిత్ శర్మ పెళ్లాడారు. మూడేళ్ల తరవాత వీరికి తొలి సంతానంగా పాప జన్మించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications