For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను... నా డ్రాగన్‌: భార్యతో దినేశ్‌ కార్తీక్‌ ఫొటో, సోషల్ మీడియాలో వైరల్

By Nageshwara Rao
See pic: ‘Me and my dragon,’ Dinesh Karthik’s adorable instagram post for wife Dipika Pallikal

హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు దినేశ్ కార్తీక్. రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడటంతో బెంగళూరులో ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టుతో పాటు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం దినేశ్‌ కార్తీక్‌కు చోటు దక్కించుకున్నాడు.

2007లో ఇంగ్లీషు గడ్డపై రాహుల్‌ ద్రవిడ్‌ సారథ్యంలో టెస్టు క్రికెట్ ఆడాడు దినేశ్ కార్తీక్. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను అప్పుడు భారత్‌ 1-0తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఏడు టెస్టులు ఆడిన కార్తీక్‌ పేలవ ప్రదర్శన చేయడంతో టెస్టులకు దూరమయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

See pic: ‘Me and my dragon,’ Dinesh Karthik’s adorable instagram post for wife Dipika Pallikal

ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరిస్ ముగియడం... ఆ తర్వాత టెస్టు సిరీస్‌ ప్రారంభానికి మధ్య కొద్ది విరామం లభించడంతో దినేశ్ తన భార్య, స్క్వాష్‌ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌తో కలిసి డెన్మార్క్‌ వెళ్లాడు. వీరిద్దరూ కలిసి డెన్మార్క్‌లోని పలు సందర్శనా స్థలాలను చుట్టేశారు. ఈ సందర్భంగా దీపికతో దిగిన ఓ ఫొటోను దినేశ్‌ ఇనిస్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు.

'నేను... నా డ్రాగన్‌' అని ఫొటో కింద క్యాష్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Sunday, July 29, 2018, 13:38 [IST]
Other articles published on Jul 29, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+