న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

See Pic: సచిన్‌ టెండూల్కర్‌ను కలిసిన పృథ్వీ షా

See Pic: Indian cricketer Prithvi Shaw meets idol Sachin Tendulkar

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ని ఆయన నివాసంలో యువ ఓపెనర్ పృథ్వీ షా సోమవారం కలిశాడు. ఇటీవల రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో ముగిసిన తొలి టెస్టుతో భారత జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే.

<strong>ముంబైదే విజయ్‌ హజారే ట్రోఫీ: ఫైనల్లో ఢిల్లీపై ఘన విజయం</strong>ముంబైదే విజయ్‌ హజారే ట్రోఫీ: ఫైనల్లో ఢిల్లీపై ఘన విజయం

దీంతో పృథ్వీ షా ఆట సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ని గుర్తుకు తెస్తున్నాయంటూ మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక, హైదరాబాద్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ పృథ్వీ షా 70, 33 నాటౌట్ పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

అనంతరం విజయ్ హజారే ట్రోఫీ సెమీస్‌లో హైదరాబాద్ జట్టుపై అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి ముంబై జట్టుని ఫైనల్స్‌కు చేర్చాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబై 4 వికెట్ల తేడాతో ఢిల్లీపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా ముంబై జట్టు 12 ఏళ్ల తర్వాత విజయ్‌ హజారే ట్రోఫీని గెల్చుకుంది.

ఇదిలా ఉంటే, విండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పృథ్వీ షాకి వన్డే సిరీస్‌లోనూ అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇప్పటికే తొలి రెండు వన్డేల కోసం జట్టుని ప్రకటించిన సెలక్టర్లు.. మిగిలిన మూడు వన్డేల కోసం త్వరలోనే జట్టుని ప్రకటించనున్నారు.

ఈ నేపథ్యంలో జట్టులోని ఓపెనర్లు రోహిత్ శర్మ లేదా శిఖర్ ధావన్‌కి విశ్రాంతినిచ్చి.. పృథ్వీ షాకి చోటివ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరరగనున్న వరల్డ్ కప్‌లోపు మూడో ఓపెనర్‌ని తయారు చేసుకోవాలనే ప్రణాళికలో భాగంగానే పృథ్వీ షాకి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.

Story first published: Monday, October 22, 2018, 19:29 [IST]
Other articles published on Oct 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X