హైదరాబాద్: శ్రీలంకతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రేయసి అనుష్క శర్మతో కలిసి చక్కెర్లు కొడుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
టెస్టు సిరిస్ అనంతరం టీమిండియాకు కాస్తంత విరామం లభించడంతో విరాట్ కోహ్లీ శ్రీలంకలో అనుష్క శర్మతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ హోటల్‌కి వెళ్లిన సమయంలో అభిమానులతో కలిసి ఫొటోలకు ఫోజిలిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అభిమానులతో కోహ్లీతో అనుష్క శర్మ కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫొటోలో టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా ఉన్నారు. అంతకముందు ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వెస్టిండిస్ పర్యటన ముందు కోహ్లీ, అనుష్కతో కలిసి అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానుంది.