See new pics: ఎద అందాలతో మత్తెక్కిస్తోన్న సుహానా ఖాన్

హైదరాబాద్: షారుక్ ఖాన్ బాలీవుడ్ బాద్ షా మాత్రమే కాదు... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సహా యజమానిగా కొనసాగుతున్నారు. షారుక్ ఖాన్ తనయ సుహానా ఖాన్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ పాపులర్ అవుతున్నారు. సుహానా ఖాన్ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఫిలిం స్కూల్‌లో శిక్షణ తీసుకుంటోంది.
బాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేయకపోయినా సుహానా ఖాన్ తన స్టైలిష్ లుక్‌తో, ట్రెండీ ఫ్యాషన్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. త్వరలోనే సుహానా ఖాన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే ప్రచారం కూడా సాగుతోంది. తాజాగా సుహానా ఖాన్ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్లాక్ టాప్‌ను ధరించిన సుహానా ఖాన్
ఈ ఫోటోలో సుహానా ఖాన్ బ్లాక్ టాప్‌ను ధరించింది. ఈ బ్లాక్ టాప్‌పై డ్రాగన్ సింబల్ ఉంది. ఇక, కింది భాగంలో బ్లాక్ కార్గో పాయింట్‌ను ధరించింది. ఈ ఫోటోపై ఓ నెటిజన్ సుహానా ఖాన్ చాలా క్యూట్‌గా ఉన్నావని కామెంట్ చేయగా... మరొక నెటిజన్ అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఫిల్మ్ మేకింగ్ కోర్సులో శిక్షణ
ప్రస్తుతం సుహానా ఖాన్ న్యూయార్క్‌లోని ఫిల్మ్ మేకింగ్ కోర్సులో శిక్షణ తీసుకుంటోంది. ఆమె తల్లి గౌరీ ఖాన్ ఇప్పటికే సుహానా ఫస్ట్ డేకు సంబంధించిన అనేక వీడియోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న సుహానా ఖాన్ తన ఇనిస్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను పోస్టు చేస్తూ ఉంటుంది.
ఇనిస్టాగ్రామ్‌లో ఎక్కువ అప్‌డేట్స్
ముఖ్యంగా తన ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ మూడ్‌లో ఉన్న ఫోటోలను ఎక్కువగా తన ఇనిస్టాగ్రామ్‌లో దర్శనమిస్తుంటాయి. ఇదిలా ఉంటే, సుహానా ఖాన్ తన స్కూలింగ్‌ను ముంబైలోని ధీరుభాయ్ అంబానీ అంతర్జాతీయ స్కూల్‌లో పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక, హైస్కూల్‌ను ఇంగ్లాండ్‌లోని ఆర్డింగ్లీ కాలేజీలో పూర్తి చేసింది.
త్వరలో బాలీవుడ్‌లోకి అరంగేట్రం
సుహానా చిన్ననాటి స్నేహితురాలు, బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఇప్పటికే బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో సుహానా ఖాన్ సైతం బాలీవుడ్‌లో అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications