న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నమ్మలేని నిజం: ఒకే ఓవర్‌లో 43 పరుగులిచ్చిన లుడిక్

Cricket World Record : 43 Runs in a Single Over | Oneindia Telugu
See ball, hit ball, New Zealand duo belt 43 runs off single over

హైదరాబాద్: ఇది నమ్మలేని నిజం. ఒకే ఒక్క ఓవర్‌లో 43పరుగులు సాధించడమనేది మామూలు విషయం కాదు. మన లెక్క ప్రకారం.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టినా 36 పరుగులే వస్తాయి. కానీ, ఇక్కడ 43 పరుగులు వచ్చేశాయి. ఇక్కడ కొసమెరపు ఏంటంటే ఆ ఓవర్‌లో రెండు నోబాల్స్‌ పడడం. వాటిని బ్యాట్స్‌మెన్ చక్కగా వాడుకుని సిక్సు బౌండరీకి తరలించడమే ఈ 43పరుగులకు కారణం.

ఒకే ఓవర్‌లో 43 పరుగులు దండుకుని

న్యూజిలాండ్‌ దేశవాళి వన్డేలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. బుధవారం సెంట్రల్‌ డిస్ట్రిక్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నార్తర్న్‌ డిస్ట్రిక్‌ బ్యాట్స్‌మెన్‌ జో కార్టర్‌, బ్రెట్‌ హంప్టన్‌ ఈ అద్భుతానికి కారకులైయ్యారు. వారి విధ్వంసానికి సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ పేసర్‌ విలియమ్‌ లుడిక్‌ అవమానం పాలైయ్యాడు. ఈ ఇద్దరు లుడిక్‌ వేసిన ఓవర్‌లో 4, 6(దాంతో పాటు ఒక నోబ్), 6(దాంతో పాటు ఒక నోబ్), 6, 1, 6, 6, 6లతో మొత్తం 43 పరుగులు దండుకుని క్రికెట్‌ చరిత్రలోనే ఓ సరికొత్త రికార్డును నెలకొల్పారు.

చెత్త రికార్డును మూటగట్టుకున్న లుడిక్‌

దీంతో ఒక ఓవర్‌లో అత్యధిక (43) పరుగులు సాధించిన రికార్డు ఆ జట్టు నార్తర్న్ డిస్ట్రిక్ బ్యాట్స్‌మెన్ నమోదు చేసుకున్నారు. ఇలా ఎక్కువ పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా లుడిక్‌ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ దెబ్బకు 10 ఓవర్లు వేసిన లుడిక్‌ మొత్తం 85 పరుగులు ఇచ్చేశాడు. మరోవైపు కార్టర్‌(102 నాటౌట్‌) సెంచరీ సాధించాడు. అతనితో పాటుగా హంప్టన్‌ (95) సెంచరీని చేజార్చుకున్నాడు.

నార్తర్న్‌ డిస్ట్రిక్‌ నిర్ణీత 50 ఓవర్లకు 313/7తో

ఈ ఇద్దరి విధ్వంసంతో నార్తర్న్‌ డిస్ట్రిక్‌ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ జట్టు 288 పరుగులే చేయడంతో నార్తర్న్‌ డిస్ట్రిక్‌ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ అద్భుత ఓవర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

 యువరాజ్‌ సింగ్‌ తొలి టీ20 ప్రపంచకప్‌లో

యువరాజ్‌ సింగ్‌ తొలి టీ20 ప్రపంచకప్‌లో

గతంలో దేశవాళీ క్రికెట్‌లో రవిశాస్త్రి, గ్యారీ సోబర్స్‌లు తిలక్‌ రాజ్‌, మాల్కోమ్‌ నాష్‌ల బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టారు. ఇలా యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ తొలి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి రికార్డు సృష్టించగా... దక్షిణాఫ్రికా ఆటగాడు గిబ్స్‌ 2007 ప్రపంచకప్‌లో నెదర్లాండ్‌ స్పిన్నర్‌ డాన్‌ వాంగ్‌ ఓవర్‌లో ఈ ఫీట్‌ సాధించిన విషయం తెలిసిందే.

Story first published: Wednesday, November 7, 2018, 16:14 [IST]
Other articles published on Nov 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X