ఇంగ్లాండ్-ఐర్లాండ్ టెస్టులో ప్రత్యేక ఆకర్షణగా ఆమె (వీడియో)

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగు రోజుల ఏకైక టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు ఆతిథ్య జట్టుకు ఐర్లాండ్ గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో తొలిరోజు ఇంగ్లాండ్‌ను ఐర్లాండ్ 85 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం ఐర్లాండ్ 207 పరుగులు చేయగా ఇంగ్లాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 122 పరుగుల ఆధిక్యం సాధించింది.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
100 ఏళ్ల బామ్మ సందడి
ఇదిలా ఉంటే, ఈ ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఓ ప్రత్యేకత చోటుచేసుకుంది. ఐర్లాండ్ ఉపప్రధాని సైమన్ కావనీయ్ 100 ఏళ్ల బామ్మ గెరాల్ బ్రౌన్ లార్డ్స్ మైదానంలో తొలిరోజు సందడి చేశారు. గెరాల్ బ్రౌన్ ఈ వారంలో తన 100వ పుట్టినరోజుని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఇంగ్లాండ్-ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న జరుగుతున్న తొలి టెస్టుకు ఆమెను తీసుకొచ్చాడు.

లార్డ్స్ ట్విట్టర్‌లో పోస్టు
ఈ సందర్భంగా ఐర్లాండ్ జట్టుకు మద్దతు తెలుపుతున్న ఆమె వీడియోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ తన అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. అందులో తొలిరోజు ఆట ఎలా సాగిందని ఆమెని ప్రశ్నించగా "అద్భుతంగా ఉంది. జేసన్‌రాయ్(5) పరుగులకే ఔటయ్యాడంటే నమ్మలేకపోతున్నా" అని ఆమె అన్నారు.
ఐర్లాండ్ గెలుస్తుందా?
ఇక, ఈ టెస్టులో ఐర్లాండ్ గెలుస్తుందా అన్న ప్రశ్నకు ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. మీరు ఎక్కువగా అడుగుతున్నారని అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే గెలిచే అవకాశం ఉందని అన్నారు. కాగా, ఈ టెస్టులో గురువారం రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 181 పరుగుల ఆధిక్యంతో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications