అడిలైడ్: ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ విమానాశ్రయంలో భారత క్రికెటర్ల సెక్యూరిటీ చెకప్‌తో ఇబ్బందులకు గురి చేసింది. అడిలైడ్ విమానాశ్రయంలో సాధారణ ప్రయాణికుల్లానే సెక్యూరిటీ చెక్‌పనకు వెళ్లాల్సి వచ్చింది. క్లియరెన్స్ వచ్చేంత వరకు బూట్లుకూడా విప్పి, మళ్లీ మళ్లీ చెకింగ్‌కు వెళ్లడం ఆశ్చర్యం కలిగించింది.
మొదట కెప్టెన్ ధోనీ సెక్యూరిటీ చెకింగ్‌కు వెళ్లాడు. తన వస్తువులన్నీ తీసి పక్కనున్న ట్రేలో పెట్టి స్కానింగ్‌కు పంపించాడు. మెటల్ డిటెక్టర్ ద్వారం నుంచి వెళ్లే సమయంలో అలారం మోగింది. దీంతో ధోనీని వెనక్కు పంపి, జేబులు ఖాళీ చేయాలని సెక్యూరిటీ సూచించింది. అలా చేసి రెండోసారి వెళ్లినా మళ్లీ అలారం మోగింది.

దీంతో ధోనీ చిరునవ్వును ఒలకబోస్తూ బకిల్ ఉన్న బూట్లను కూడా తీసేసి మెటల్ డిటెక్టర్ ద్వారం నుంచి వెళ్లడంతో మూడోసారి సక్సెస్ అయ్యాడు. సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం ధోనీ పడుతున్న పాట్లు చూసి మిగతా వాళ్లు నవ్వుకున్నారు. తర్వాత జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి వంతు వచ్సింది. కౌబాయ్ టోపీతోపాటు, కళ్లజోడును కూడా తీసేసిన శాస్త్రి సెక్యూరిటీ చెకింగ్ పాసయ్యాడు.
న్యూఢిల్లీ: దూరదర్శన్ (డీడీ)లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు వీక్షిస్తున్న అభిమానులకు ఎటువంటి ఆటంకం కలగకుండా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టార్ టీవీ అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను డీడీ ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. జస్టిస్ రంజన్ గొగయ్ నేతృత్వంలో ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలను వెలువరించింది. ప్రయివేటు చానల్స్ అందించే లైవ్ ఫీడ్‌ను ప్రసారం చేయడానికి మరో చానెల్ ప్రారంభించాలని స్టార్ టీవీ చేసిన సూచనపై ప్రతిస్పందన తెలియజేయాల్సిందిగా ప్రసారభారతిని ఆదేశించింది.