Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో మరో భద్రతా లోపం.. పాకిస్థాన్ ఏం చేస్తోంది?
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 29 ఏళ్ల తర్వాత టోర్నమెంట్ నిర్వహిస్తున్న పాకిస్థాన్ లో భద్రత గురించి నిరంతరం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి సరిగా భద్రత కల్పించడం లేదు. తాజాగా పాకిస్థాన్ లో అలాంటి మరో కేసు బయటపడింది. భద్రతా లోపాల కారణంగా కొంత మంది పోలీసులను వారి ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం.
మరో భారీ భద్రతా లోపం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా తమకు కేటాయించిన భద్రతా విధులను నిర్వర్తించడానికి నిరాకరించినందుకు పాకిస్థాన్ లోని పంజాబ్ కు చెందిన 100 మందికి పైగా పోలీసులను సర్వీస్ నుంచి తొలగించారు. పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం ఈ మేరకు సమాచారం ఇచ్చారు. తొలగించబడిన సిబ్బంది పోలీస్ దళంలోని వివిధ విభాగాలకు చెందిన వారు.

100 మందికి పైగా పోలీసుల తొలగింపు
ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంహా అనేక సందర్భాల్లో విధులకు హాజరు కాని 100 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బందిని వారి పోస్టుల నుంచి తొలగించినట్లు పంజాబ్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. లాహోర్ లోని గడాఫీ స్టేడియం నుంచి కేటాయించబడిన హోటళ్లకు ప్రయాణించే జట్లకు భద్రత కల్పించేందుకు పోలీసు అధికారులను నియమించారని ఆయన వెల్లడించారు. కానీ వారు విధులకు హాజరు కాలేదని.. తమ బాధ్యతలను చేపట్టడానికి పూర్తిగా నిరాకరించారని వెల్లడించారు.
కఠిన చర్యలకు ఆదేశాలు
పంజాబ్ ఐజీపీ ఉస్మాన్ అన్వర్ ఈ విషయాన్ని గుర్తించి సంబంధిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని ఆ అధికారి పేర్కొన్నారు. అంతర్జాతీయ టోర్నమెంట్ భద్రత విషయానికి వస్తే అలసత్వానికి ఆస్కారం లేదని ఆయన తెలిపారు. తొలగించబడిన పోలీసులు తమ అధికారిక విధిని నిర్వర్తించడానికి ఎందుకు నిరాకరించారనే విషయంపై అధికారిక ప్రకటన లేదు. కానీ ఆ పోలీసులు విధుల నిర్వహణకు హాజరు కాకపోవడం వల్ల మూల్యం చెల్లించుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications