మ్యాక్స్‌వెల్ స్టంపౌట్ వెనుకున్న సీక్రెట్ ఇదే: చాహల్
హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు జరిగిన మూడు వన్డేల్లో ఆ జట్టు విధ్వంసకర బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్... చాహల్ బౌలింగ్‌లోనే అవుటైన సంగతి తెలిసిందే. గురువారం బెంగళూరు వేదికగా ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. ఈ సందర్భంగా చాహల్ మీడియాతో మాట్లాడుతూ మాక్స్‌వెల్‌ను అవుట్ చేయాలంటే మూడు డాట్ బంతులు చాలని చెప్పాడు.
'మ్యాక్స్‌వెల్ ప్రమాదకర బ్యాట్స్‌మన్. ఒకవేళ అతను మైదానంలో నిలదొక్కుకుంటే బౌలర్లపై విరుచుకుపడతాడు. వీలైనంత త్వరగా అతన్ని పెవిలియన్‌కి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం నేను ప్రత్యేక ప్రణాళిక రచించుకున్నాను. మాక్స్‌వెల్‌కు బౌలింగ్ చేసేటప్పుడు బంతిని స్టంప్స్ వైపు వేయకుండా అవుట్ సైడ్ స్టంప్స్‌కు వేస్తాను' అని అన్నాడు.

రెండు నుంచి మూడు డాట్ బాల్స్
'నేను వేసే ఓవర్‌లో ఖచ్చితంగా రెండు నుంచి మూడు బంతులు డాట్ అవుతాయి. దీంతో మాక్స్‌వెల్ ఒత్తిడికి లోనై క్రీజు వదలి భారీ షాట్‌కు ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలోనే అతడి వికెట్ దక్కుతుంది. ఇదే స్టంప్ అవుట్‌ల వెనుక ఉన్న రహస్యం' అని యువ స్పిన్నర్ చాహల్ చెప్పాడు.

క్రీజులో కుదురుకుంటే విధ్వంసమే
అనంతరం ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రీజులో కుదురుకుంటే విధ్వంసం సృష్టిస్తాడని పేర్కొన్నాడు. దీంతో వార్నర్ ఎంత త్వరగా అవుట్ చేస్తే మాకు మిడిల్ ఓవర్లలో అంత ఒత్తిడి తగ్గుందోని చాహల్ పేర్కొన్నాడు. 'ఆసీస్ జట్టులో వార్నర్ విధ్వంసకర ఆటగాడు. అతను నిలదొక్కుకుంటే భారీ ఇన్నింగ్స్ ఖాయం. ఐపీఎల్ ద్వారా అతనికి మన పిచ్‌లపై ఆడిన అనుభవం ఉంది' అని తెలిపాడు.

వీలైనంత త్వరగా పెవిలియన్ పంపాలి
'వార్నర్ క్రీజులో కుదురుకుని 40-50 బంతులు ఆడితే 70-80 పరుగులు రాబడతాడు. అతన్ని వీలైనంత త్వరగా పెవిలియన్‌కి పంపగలిగితే మధ్య ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకురాగలం. మన స్పిన్నర్లు ఇప్పటి వరకు 13 వికెట్లు దక్కించుకున్నారు. జంపా ఒకడే ఆ జట్టులో మణికట్లు స్పిన్నర్. అతను స్థిరంగా రాణించలేకపోతున్నాడు' అని చాహల్ పేర్కొన్నాడు.

ఒత్తిడిలేకుండా బౌలింగ్ చేయగలం
ఇక బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేస్తే బౌలర్లు ఎలాంటి ఒత్తిడిలేకుండా బౌలింగ్ చేయగలరని చాహల్ వ్యాఖ్యానించాడు. ఇరు జట్ల మధ్య గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నాలుగో వన్డే జరగనుంది. ఐదు వన్డేల సిరిస్‌ను కోహ్లీసేన ఇప్పటికే 3-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చివరి రెండు వన్డేల్లో కూడా విజయం సాధించి ఆసీస్‌ను వైట్ వాష్ చేయాలని చూస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications