Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

4ఏళ్లు గుట్టుగా.. రెస్టారెంట్ అమ్మాయితో సాహా ప్రేమకథా చిత్రమ్!

క్రమక్రమంగా పూర్తిస్థాయి కంప్యూటర్ తరానికి మారుతోన్న రోజులవి. అప్పుడప్పుడే సోషల్ మీడియా పరిచయం అవుతోన్న కాలం. ఆ సమయంలో అప్పుడే కొత్తగా వచ్చిన ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా ఓ టీమిండియా క్రికెటర్, కామన్ గర్ల్ మధ్య ప్రేమ చిగురించింది. అలా నాలుగేళ్ల పాటు గుట్టుగా సాగిన ఆ ప్రేమ, మూడుముళ్ల బంధంగా మారింది. ఈ ప్రేమ కథ మరెవరిదో కాదు వృద్ధిమాన్ సాహా, రోమి మిత్రాది.

తాజాగా వృద్ధిమాన్‌ సాహా అన్ని క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీలో భాగంగా పంజాబ్‌ జట్టుతో ముగిసిన మ్యాచ్ తర్వాత తన 28 ఏళ్ల క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అతడి ఆటతీరు, సాధించిన రికార్డులు, వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి వంటి విషయాలు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సాహా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

Secret Love Story with wife Romi goes viral after Wriddhiman Saha retirement in ranji trophy

ఆ ఫొటో చూసి ప్రేమలో
2007లో సాహా తన క్రికెట్ కెరీర్ ను ప్రారంభించాడు. తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ను బంగాల్ తరఫున ఆడాడు. ఆ సమయంలోనే 2008లో ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాట్.. సోషల్ మీడియా సైట్ ఆర్కట్ లో అమ్మాయకపు కళ్లు, క్యూట్ ఫేస్ ఉన్న ఓ అమ్మాయి ఫొటోను చూసి లవ్ యట్ ఫస్ట్ సైట్ లో పడిపోయాడు. ఆ అమ్మాయే రోమి మిత్రా.

ఆమె రాకతో కలిసొచ్చిన అదృష్టం
క్రమంగా రోమితో పరిచయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాడు సాహా. అలా సాహా - రోమి మధ్య మాటలు కలిశాయి. మాటలు కాస్త స్నేహానికి దారీతిసింది. ఈ ప్రయాణంలోనే ఇద్దరి మనసులు కలిశాయి. అలా వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. నాలుగేళ్ల పాటు వీరి ప్రేమాయణం సాగింది. ఈ క్రమంలోనే 2010లో సాహా తొలిసారి టీమిండియా టెస్ట్ టీమ్ కు సెలెక్ట్ అయ్యాడు. అనంతరం వన్డే జట్టుకు కూడా ఎంపికయ్యాడు. రోమి తన జీవితంలోకి రావడం వల్లే ఇదంతా కలిసొచ్చిందని ఎంతో సంబరపడిపోయాడు సాహా.

నాలుగేళ్ల తర్వాత పెళ్లి
అనంతరం జట్టుకు ఎంపికైన ఏడాది తర్వాత 2011లో రోమిని పెళ్లాడాడు సాహా. అలా నాలుగేళ్ల పాటు సైలెంట్ గా డేటింగ్ చేసిన వీరిద్దరూ ఒక్కటయ్యారు. రోమి పెళ్లయ్యాక తన పేరును Debarati Sahaగా మార్చుకుంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె కోల్ కతాలోని సంతోష్ పుర్ ఏరియాలో ఓ రెస్టారెంట్ ను నడుపుతోంది. ఈ రెస్టారెంట్ లో బంగ్లాదేశీ, ఇండియన్, ఆసియా, చైనీస్ ఫుడ్ దొరుకుతుంది. ఇక ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దమ్మాయి పేరు అన్వీ. చిన్న కొడుకు పేరు అనయ్.

Story first published: Sunday, February 2, 2025, 10:36 [IST]
Other articles published on Feb 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+