Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క బాల్‌కి పదకొండు పరుగులిచ్చిన బౌలర్ (వీడియో)

Sean Abbott concedes 11 runs in 1 ball as Perth Scorchers crush Sydney Sixers

హైదరాబాద్: గేమ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కెప్టెన్‌లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సరిగ్గా అలాంటి నిర్ణయమే ఆడమ్ వోగ్స్ అనే కెప్టెన్ తీసుకున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో బాగా నేర్పు ఉన్న బౌలర్‌గా పరిగణించి ఆఖరి ఓవర్లో బౌలింగ్‌ని అప్పగించాడు.

టీ20 లీగ్ చివరి ఓవర్లో బ్యాటింగ్ జట్టు విజయానికి 9 పరుగులు అవసరం. బౌలర్ తొలి మూడు బంతుల్ని కట్టుదిట్టంగా విసిరితే బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగింది. బౌలరే తీవ్ర ఒత్తిడిలో ఒక్క బంతికే 11 పరుగులిచ్చేశాడు. దీంతో బ్యాటింగ్ జట్టు తేలికగా విజయం సాధించింది.

ఈ ఘటన బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్క్రాచర్స్, సిడ్నీ సిక్సర్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పెర్త్ స్క్రాచర్స్.. ఆఖరి ఆరు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన పరిస్థితి. తమ బౌలర్ సీన్ అబాట్‌పై నమ్మకం ఉంచిన కెప్టెన్ అతడి చేతికి బంతిని అందించాడు.
కానీ ఒత్తిడిలో ఉన్న అబాట్ తొలి బంతినే లెగ్ సైడ్ వైడ్‌గా విసిరాడు. అది కాస్తా బౌండరీ చేరడంతో ఐదు పరుగులొచ్చాయి. విజయానికి ఆరు బంతుల్లో 4 పరుగులు మాత్రమే అవసరం కావడంతో బ్యాట్స్‌మెన్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అబాట్ విసిరిన మరుసటి బంతి ఫుల్ టాస్ కావడంతో ఊపు మీదున్న ఆడమ్ వోగ్స్.. బౌలర్ తల మీదుగా సిక్సర్‌గా మలిచాడు. అబాట్ ఒక్క బంతికే 11 పరుగులు ఇచ్చుకోవడంతో బ్యాటింగ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

తమ బౌలర్ ఏం చేశాడో అర్థం కాక సిడ్నీ సిక్సర్స్ తలపట్టుకోగా... ఆఖరి ఓవర్లో అలవోకగా విజయం సాధించడంతో పెర్త్ స్క్రాచర్స్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలో సంబరాలు చేసుకున్నారు

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 4, 2018, 15:20 [IST]
Other articles published on Jan 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+