KKR vs MI: 'ఈ సీజన్‌లో ఆండ్రీ రసెల్ కంటే.. శుభమన్ గిల్ చాలా కీలకం'

దుబాయ్: ఐపీఎల్ 13వ సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో జరిగే మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్‌లో కోల్‌కతా తొలి మ్యాచ్ ఆడనుండగా.. ముంబై రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌పై పడ్డాయి. 2019 సీజన్‌లో రసెల్ తన విధ్వంసం ప్రదర్శించాడు. కోల్‌కతా తరపున 14 మ్యాచ్‌లాడిన రసెల్, 510 పరుగులు, 11 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

రసెల్ కంటే గిల్ కీలకం:
గత సీజన్‌లో ఆండ్రీ రసెల్ టోర్నీ మొత్తంలో 52 సిక్సులు బాది ఆసీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అయితే ఈ సీజన్‌లో రసెల్ కంటే యువ ఆటగాడు శుభమన్ గిల్ జట్టుకు కీలకంగా మారనున్నాడని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. రాబిన్ ఊతప్ప, గౌతమ్ గంభీర్ లాంటి టాప్ ప్లేయర్లు కోల్‌కతాకు దూరమైన తర్వాత శుభమన్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందన్నాడు. తాజాగా స్టైరిస్ స్టార్‌స్పోర్ట్స్‌తో జరిగిన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

విదేశీ ఆటగాడిగా రసెల్:
'గత కొన్ని నెలలుగా శుభమన్ గిల్‌ను దగ్గరుండి చూస్తున్నా. గిల్‌లో మంచి నైపుణ్యం ఉంది. దానిని సక్రమంగా ఉపయోగించుకుంటే విధ్వంసకర ఇన్నింగ్స్‌లు చూసే అవకాశం ఉంటుంది. గతంలో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాబిన్ ఊతప్ప, గౌతమ్ గంబీర్‌లు లేకపోవడంతో గిల్ జట్టులో కీలకంగా మారనున్నాడు. ప్రధాన బ్యాట్స్‌మన్‌గా మారే అవకాశం ఉంది. రసెల్ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అతను విదేశీ ఆటగాడిగా జట్టులో ఉంటాడు. కాబట్టి దేశీయ ఆటగాళ్లలో శుభమన్‌కు ఇది మంచి అవకాశమని నా అభిప్రాయం' అని స్కాట్ స్టైరిస్ పేర్కొన్నాడు.

గిల్‌కు ఆ అవకాశం లేదు:
'స్వదేశీ ఆటగాళ్లలో పృథ్వీ షా, దేవదూత్ పడిక్కల్ కంటే శుభమన్ గిల్‌పై ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వారిద్దరు వేరే టీమ్‌లలో కొనసాగుతున్నా.. సీనియర్ ఆటగాళ్ల మధ్యన ఉండడంతో ఒత్తిడి అంతగా ఉండదు. దీంతో అతడు ఆటపై దృష్టి సారిస్తారు. కానీ గిల్‌కు ఆ అవకాశం లేదు. కోల్‌కతాలో అంతా హిట్టర్లే ఉన్నారు. అందరికి హిట్టింగ్ చేసే నైపుణ్యం ఉండడంతో గిల్ తన ప్రతిభను బయటపెట్టేందుకు ఇదే మంచి అవకాశం. నా అంచనా ప్రకారం కేకేఆర్ ఐపీఎల్ 2020లో టాప్-4లో ఒకటిగా నిలుస్తుంది' అని స్టైరిస్ తెలిపాడు.

హిట్టర్లతో బలంగా:
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తర్వాత 2018లో కేకేఆర్ జట్టు పగ్గాలు అందుకున్న దినేశ్ కార్తిక్.. ఆ సీజన్‌లో ఫర్వాలేదనిపించాడు. జట్టును నాలుగో స్థానంలో నిలబెట్టాడు. కానీ గతేడాది కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా తీసుకెళ్లలేదు. దీంతో అతనిపై విమర్శలు ఎదురయ్యాయి. .కెప్టెన్‌గా డీకేను తొలగిస్తారని వార్తలు వెలుబడ్డాయి. అయితే యాజమాన్యం మాత్రం అతనిపై నమ్మకముంచింది. దినేశ్ కార్తిక్ నేతృత్వంలో మంచి హిట్టర్లతో బలంగా కనిపిస్తున్న కేకేఆర్.. ముంబైతో మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.
KKR vs MI: మరో 90 పరుగులు చేస్తే.. అరుదైన రికార్డు అందుకోనున్న రోహిత్ శర్మ!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications