IPL 2020 ప్లే ఆఫ్‌కు ఆ నాలుగు జట్లు.. ఆర్‌సీబీకి నో చాన్స్: స్కాట్ స్టైరిస్

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌కు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. కరోనా నేపథ్యంలో ఎన్నో ఆటంకాలు.. మరెన్నో అడ్డంకులను అధిగమించిన ఈ క్యాష్ రిచ్ లీగ్ యూఏఈ వేదికగా అభిమానులను అలరించేందుకు ముస్తాబైంది. సెప్టెంబర్ 19న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ షురూ కానుంది.ఇక ఫ్రాంచైజీలు కూడా తమ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టాయి.

ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తమ ఆటగాళ్లు నెట్స్‌లో శ్రమిస్తున్న వీడియోలను ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకుంటున్నాయి. మరోవైపు మాజీ క్రికెటర్ల విశ్లేషణలు, అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్‌లీ ఈ సారి సీఎస్‌కే గెలుస్తుందనగా.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఢిల్లీ క్యాపిటల్స్ చాంపియన్‌గా నిలుస్తుందనుకుంటున్నా అని తెలిపాడు. తాజాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ ఏకంగా ప్లే ఆఫ్ చేరే జట్లను అంచనా వేసాడు. అంతేకాకుండా ఈ సీజన్ లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక 8 జట్లు పొందే స్థానాలను కూడా డిసైడ్ చేశాడు.

 టేబుల్ టాపర్ ఢిల్లీ..

టేబుల్ టాపర్ ఢిల్లీ..

ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరని ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి టేబుల్ టాపర్‌గా నిలుస్తుందన్నాడు. ఇక ఢిల్లీ కూడా కోచ్ రికీపాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కొత్తగా, బలంగా కనిపిస్తుంది. రవిచంద్రన్ అశ్విన్, అజింక్యా రహానే, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్, షిమ్రాన్ హెట్‌మైర్‌తో తమ బలగాన్ని పెంచుకుంది. పృథ్వీషా, శిఖర్ ధావన్, రహానే, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ వంటి భారత ఆటగాళ్లకు తోడు.. మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, హెట్‌మైర్ వంటి విదేశీ ఆటగాళ్లతో ఆ జట్టు ధృడంగా కనిపిస్తోంది.

 రెండో స్థానంలో ముంబై..

రెండో స్థానంలో ముంబై..

ఇక ఢిల్లీ తర్వాత డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో నిలుస్తుందని స్కాట్ స్టైరిక్ అంచనా వేసాడు. ఆరంభంలో ఇబ్బంది పడడం.. మధ్యలో పుంజుకోవడం.. చివర్లో చెలరేగి ఆడడం...ఐపీఎల్‌‌లో రోహిత్ శర్మ సారథ్యంలోనే ముంబై ఇండియన్స్ శైలి‌. ఇప్పటికే నాలుగు టైటిళ్లు నెగ్గి తిరుగులేని జట్టుగా నిలిచింది. క్రిస్‌‌ లిన్‌‌ రాకతో ఆ జట్టు బ్యాటింగ్ బలం మరింత స్ట్రాంగ్‌‌గా మారింది. సౌతాఫ్రికా వికెట్‌‌ కీపర్​ క్వింటన్‌‌ డికాక్‌‌తో కలిసి లిన్ ముంబై ఇన్నింగ్స్‌‌ ఆరంభించవచ్చు. అప్పుడు కెప్టెన్​ రోహిత్‌ శర్మ‌ వన్‌‌డౌన్‌‌లో వచ్చే అవకాశం ఉంది. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు నిలిచినా అవతలి టీమ్‌‌ బౌలర్లకు మూడినట్టే. రోహిత్‌‌ కూల్‌‌ కెప్టెన్సీ జట్టు‌కు అదనపు బలం. వరల్డ్‌‌ బెస్ట్‌‌ టీ20 బౌలర్లలో ఒకడైన జస్‌ప్రీత్ బుమ్రా, వరల్డ్‌‌ క్లాస్‌‌ ఆల్‌‌రౌండర్లైన హార్దిక్ పాండ్యా, కీరన్‌‌ పొలార్డ్‌‌ అండ ముంబై సొంతం. సూర్యకుమార్​, ఇషాన్‌‌ కిషన్‌‌ రూపంలో భారత యువ ఆటగాళ్ల‌ మద్దతు‌ కూడా ఉంది.

మూడు, నాలుగు స్థానాల్లో కేకేఆర్, సీఎస్‌కే

ఇక దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్, మహేంద్ర సింగ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మూడు, నాలుగు స్థనాల్లో నిలుస్తాయని స్కాట్ స్టైరిక్ అభిప్రాయపడ్డాడు. ఇరు జట్లు బలంగానే ఉన్నాయి. ఇయాన్ మోర్గాన్ వంటి వరల్డ్ కప్ విన్నింగ్స్ కెప్టెన్ సహకారం కేకేఆర్‌కు కలిసిరానుంది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్, విధ్వంసకర వీరుడు ఆండ్రూ రస్సెల్‌ ఉండనే ఉన్నారు. ఇక చెన్నైలో రైనా, భజ్జీ దూరమైనా.. అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు ఆ జట్టు నిలయం. అంబటి రాయుడు, వాట్సన్, డ్వేన్ బ్రావో, క్లిష్ట పరిస్థితులనైనా తనవైపు తిప్పుకునే ధోనీతో ఆ జట్టు బలంగా ఉంది.

 రాజస్థాన్ లాస్ట్.. ఆర్‌సీబీకి నో చాన్స్..

రాజస్థాన్ లాస్ట్.. ఆర్‌సీబీకి నో చాన్స్..

ఇక టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్‌సీబీ ఆరో స్థానానికి పరిమితమవుతుందని ఈ న్యూజిలాండ్ క్రికెటర్ అంచనావేసాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ టేబుల్‌లో లాస్ట్ ప్లేస్‌లో నిలుస్తుందన్నాడు. కింగ్స్ పంజాబ్ ఏడు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదో స్థానానికే పరిమితమవుతాయన్నాడు. ఇది తన అంచనా మాత్రమేనని చెప్పిన స్కాట్ స్టైరిక్ వీటి వెనుక ఉన్న కారణాలను మాత్రం విశ్లేషించలేదు. స్కాట్ స్టైరిక్ అంచనా: 1. ఢిల్లీ క్యాపిటల్స్ 2. ముంబై ఇండియన్స్ 3. కోల్‌కతా నైట్ రైడర్స్ 4. చెన్నై సూపర్ కింగ్స్ 5. సన్ రైజర్స్ హైదరాబాద్ 6. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 7. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 8. రాజస్థాన్ రాయల్స్

బెన్ స్టోక్స్ రాకపై క్లారిటీ లేదబ్బా: రాజస్థాన్ రాయల్స్ కోచ్

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 15, 2020, 13:56 [IST]
Other articles published on Sep 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X