Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Scott Styris: హార్దిక్ పాండ్యా భారత టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్ అయితే నేను ఆశ్చర్యపోను

Scott Styris Felt Hardik Pandya Became Full time Captain to India T20 Squad in Near Future

వైట్‌బాల్ క్రికెట్‌లో భారత టీంకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా తనకు బాధ్యత అప్పగిస్తే తప్పకుండా స్వీకరిస్తానని హార్దిక్ పాండ్యా చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్.. భారత టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యా సమీప భవిష్యత్తులో కెప్టెన్సీ వహించగలడని చెప్పాడు. ఆసియాకప్ టోర్నీకి కాకపోయినా మరి కొంత కాలానికి హార్దిక్ పాండ్యా భారత టీ20 జట్టుకు కెప్టెన్ అయితే అస్సలు ఆశ్చర్యపోను లేదని చెప్పాడు. న్యూస్ 18 షో 'స్పోర్ట్స్ ఓవర్ ది టాప్'లో స్టైరిస్ ఈ వ్యాఖ్యలు చెప్పాడు. హార్దిక్ ఇప్పటికే భారత్ తరఫున మూడు టీ20 మ్యాచ్లకు నాయకత్వం వహించాడు. ఐర్లాండ్‌పై రెండు మ్యాచ్‌లు, వెస్టిండీస్‌పై ఒక మ్యాచ్ కెప్టెన్సీ వహించాడు. ఈ మూడింట్లో హార్దిక్ కెప్టెన్సీలో జట్టు గెలుపొందింది.

'ఇది ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అని నేను భావిస్తున్నాను. ఓ ఆరు నెలల క్రితం మనమందరం ఇలాంటి ఓ విషయం గురించి మాట్లాడుతామని అనుకోని ఉండము. కానీ ఈ ఆరు నెలల్లో హార్దిక్ పాండ్యా ఏం చేసి చూపించాడో మనందరికీ తెలిసిందే. అతను తనకు అందివచ్చిన ప్రతి అవకాశంలో విజయం సాధించాడు. మీరు ఫుట్‌బాల్‌లో ఇలాంటి అనూహ్య పరిణామాలు చూస్తుంటారు. కానీ క్రికెట్లో హార్దిక్ పాండ్యా దీన్ని చేసి చూపించాడు.' అని స్టైరిస్ పేర్కొన్నాడు.

'హార్దిక్ పాండ్యా భవిష్యత్తులో టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా అయ్యే విషయం పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయదు. ఎందుకంటే టీమిండియా టీ20 ఫార్మాట్లో ఏ దిశలో వెళ్లాలనుకుంటుంది. టీ20లో భారత జట్టు అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వైపు చూస్తున్నట్లు కన్పిస్తుంది. హార్దిక్ పాండ్యా కచ్చితంగా అలాంటి తరహా ఆటకు నాయకత్వం వహించగల నైపుణ్యాలు ఉన్నవాడు. స్వభావసిద్ధంగా ఆ శైలితో ఆడే హార్దిక్ పాండ్యా వల్ల జట్టులోని ప్రతి ఒక్కరికి ఆ బ్రాండ్ క్రికెట్ వ్యాప్తిస్తుంది' అని స్టైరిస్ పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్‌కి తొలి సీజన్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను అందించాడు. జూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 2-0తో భారత్ అతని కెప్టెన్సీలో గెలుపొందింది.

Story first published: Wednesday, August 10, 2022, 19:56 [IST]
Other articles published on Aug 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+