Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్కాట్లాండ్ చేతిలో వెస్టిండీస్ ఘోర పరాజయం - రెండుసార్లు ఛాంపియన్ అయినా..

Scotland won the match against West Indies by 42 runs in T20 World Cup 2022

హోబర్ట్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. తొలి రోజు- తొలి మ్యాచ్‌కే పరిమితం కాలేదివి. రెండో రోజూ క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. స్కాట్లాండ్ జట్టు.. తనకంటే ఎంతో బలమైన వెస్టిండీస్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌లో, ఆ తరువాత బౌలింగ్‌లో అంచనాలకు అందని విధంగా రాణించింది. రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిని కరేబియన్ వీరులను ముప్పతిప్పలు పెట్టింది స్కాట్లాండ్. 20 ఓవర్లను కూడా విండీస్ ఆడలేకపోయింది. ఊహించని పరాజయంతో ఈ టోర్నమెంట్‌లో ఆ జట్టు ప్రస్థానం ఇక ప్రమాదంలో పడినట్టే.

160 పరుగులు..

160 పరుగులు..

తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్... నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ మున్సే 66 పరుగులతో కదం తొక్కాడు. జట్టును ముందుండి నడిపించాడు. 53 బంతుల్లో తొమ్మిది ఫోర్లతో 66 పరుగులు చేశాడు జార్జ్. మైఖెల్ జోన్స్-20, మాథ్యూ క్రాస్-3, కేప్టెన్ రిచీ బెర్రింగ్టన్-16, కాలమ్ మెక్‌లియోడ్-23, మైఖెల్ లీస్క్-4, క్రిస్ గ్రీవ్స్-16 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లు అల్జారీ జోసెఫ్, జేసన్ హోల్డర్ రెండేసి చొప్పున వికెట్లు పడగొట్టారు. ఓడియన్ స్మిత్ ఒక వికెట్ తీసుకున్నాడు.

 పోరాడలేక..

పోరాడలేక..

ఈ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించడంలో విండీస్ వీరులు తడబడ్డారు. జట్టు స్కోరును వంద పరుగులు దాటించడానికే నానా అవస్థలు పడ్డారు. 18.3 ఓవర్లల్లో 118 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఏ దశలో కూడా గెలిచేలా కనిపించలేదు విండీస్. ప్రారంభం నుంచీ వికెట్లను క్రమం తప్పకుండా కోల్పోతూ వచ్చింది. జట్టు స్కోర్ 20 పరుగుల వద్ద ఉన్నప్పుడు తొలి వికెట్‌ను కోల్పోగా.. ఇక ఎక్కడేగానీ తేరుకోలేకపోయింది.

హోల్డర్ ఒక్కడే..

హోల్డర్ ఒక్కడే..

ఓపెనర్లు కైలే మేయర్స్-20, ఎవిన్ లెవిస్-14, బ్రాండన్ కింగ్-17, కేప్టెన్ నికొలస్ పూరన్-5, షమారా బ్రూక్స్-4, రౌమన్ పావెల్-5, అకీల్ హొస్సైన్-1, అల్జారీ జోసెఫ్-0 పరుగులు చేశారు. ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ ఒక్కడే స్కాట్లాండ్ బౌలింగ్‌ను కాస్త ధీటుగా ఎదుర్కొని నిలిచాడు. 33 బంతుల్లో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో 38 పరుగులు చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ 3 మూడు వికెట్లతో చెలరేగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు నేల కూల్చాడు. బ్రాండన్ కింగ్, అల్జారీ జోసెఫ్, ఒడియన్ స్మిత్ వికెట్లను తీసుకున్నాడు. బ్రాడ్ వీల్, మైఖెల్ లీక్స్ రెండు చొప్పున, జోష్ డవే, సఫ్యాన్ షరీఫ్ ఒక్కో వికెట్‌ను పడగట్టారు.

నమీబియా చేతిలో..

నమీబియా చేతిలో..

పెద్దగా ఆసక్తికరంగా ఉండబోవని ఆశించిన టీ20 ప్రపంచకప్ 2022 గ్రూప్ దశ మ్యాచ్‌లు సంచలనాలకు కేంద్రబిందువులుగా కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడుసార్లు టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరిన శ్రీలంకను నమీబియా ఓడించిన విషయం తెలిసిందే. అదే పెద్ద సెన్సేషన్ అనుకుంటోండగా.. స్కాట్లాండ్ మరో అడుగు ముందుకేసింది. రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌ను మట్టి కరిపించింది.

Story first published: Monday, October 17, 2022, 14:54 [IST]
Other articles published on Oct 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+