Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: రాణించిన స్కాట్లాండ్.. వెస్టిండీస్ టార్గెట్ 161 పరుగులు..

 Scotland set a target of 161 runs to West Indies in the T20 World Cup 2020 match

టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా బెల్లెరివ్ ఓవల్ లో వెస్టిండీస్, స్కాట్లాండ్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. టాస్ గెలిటిన విస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన స్కాట్లాండ్ మొదట్లో దాటిగా ఆడింది. స్కాట్లాండ్ 5.3 ఓవర్లో ఒక్క వికెటు కూడా కోల్పోకుండా 52 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కల్గించింది. వర్షం తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.

జార్జ్ మున్సే
ఆ తర్వాత వెస్టిండీస్ బౌలర్లు కాస్త పుంజుకున్నారు. స్కాట్లాండ్ ఆటగాళ్లలో ఓపెనర్ జార్జ్ మున్సే 53 బంతుల్లో 9 ఫోర్లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. మున్సే వెస్టిండీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కోంటూ బౌండరీలు బాదాడు. కాలమ్ మాక్లియోడ్ 23, మైఖేల్ జోన్స్ 20 పరుగులు చేయగా మిగతా ఆటగాళ్లు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. ఒడియన్ స్మీత్ ఒక వికెట్ తీశాడు.

నమీబియా, నెదర్లాండ్
వరల్డ్ కప్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల్లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో టాప్ లో ఉన్న నాలుగు సూపర్ 12 దశకు అర్హత సాధిస్తాయి. గ్రూప్ స్టేజీలో శ్రీలంక, వెస్టిండీస్ ఫేవరెట్లుగా ఉన్నాయి. ఆదివారం జరిగిన ఓపెనర్‌లో మిన్నోస్ నమీబియా చేతిలో చిత్తుగా ఓడింది యూఏఈ, నెదర్లాండ్ మ్యాచ్ నెదర్లాండ్ గెలిచింది. గ్రూప్ స్టేజీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి నమీబియా, నెదర్లాండ్ రెండేసి పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి.

Story first published: Monday, October 17, 2022, 12:41 [IST]
Other articles published on Oct 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+