For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొదటి కేసు.. క్రికెటర్‌కు కరోనా పాజిటివ్‌!!

Scotland Cricketer Majid Haq Tests Positive for Coronavirus

లండన్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) రోజురోజుకు వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఇప్పటికే ఓ ఫుట్‌బాల్‌ చనిపోగా.. ప్రతిష్ఠాత్మక 'లా లిగా' క్లబ్‌కు చెందిన స్పానిష్‌ ఫుట్‌బాల్‌ జట్టు అలవేస్‌లోని 15 మందికి సోకింది. తాజాగా క్రికెటర్లలో కూడా తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. స్కాట్లాండ్‌కి చెందిన ఆఫ్‌ స్పిన్నర్‌ మాజిద్‌ హక్‌కు కరోనా వైరస్‌ సోకింది.

మాజిద్‌ హక్‌కు కరోనా:

మాజిద్‌ హక్‌కు కరోనా:

పాకిస్తాన్‌ సంతతికి చెందిన స్కాట్లాండ్‌ క్రికెటర్, ఆఫ్‌ స్పిన్నర్‌ మాజిద్‌ హక్‌కు కరోనా వైరస్ సోకింది. 37 ఏళ్ల మాజిద్‌ స్వయంగా ఈ విషయాన్ని శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. ఇటీవల కరోనా వ్యాపించడంతో.. ప్రస్తుతం తాను స్కాట్లాండ్‌ రాజధాని గ్లాస్గోలోని రాయల్‌ అలెగ్జాండ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నానని, త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకొని ఇంటికి తిరిగి వస్తానని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.

పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకు వస్తా:

పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకు వస్తా:

'కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలాక చికిత్స తీసుకొని మెరుగైన ఆరోగ్యంతో ఇవాళ ఇంటికి వెళుతున్నా. పెయిస్లీలోని రాయల్‌ అలెగ్జాండ్రియా ఆస్పత్రి సిబ్బంది చాలా బాగా చూసుకున్నారు. ఈ సందర్భంగా నాకు మెసేజెస్‌ చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకు వస్తా' అని మజిద్‌ ట్వీట్‌ చేశాడు.

54 వన్డేలు, 24 టీ20లు:

54 వన్డేలు, 24 టీ20లు:

2006 నుంచి 2015 వరకు అంతర్జాతీయ క్రికెటర్‌గా కొనసాగిన మజిద్‌ హాక్‌ 54 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. వన్డేల్లో 60 వికెట్లు.. టి20ల్లో 28 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ ఆతిథ్యమిచ్చిన 2015 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారి స్కాట్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించిన మాజిద్‌.. ప్రస్తుతం స్కాట్లాండ్‌ దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. గతేడాది వరకు స్కాట్లాండ్‌ తరఫున అత్యధిక వన్డే వికెట్లు(60) తీసిన బౌలర్‌గా కొనసాగాడు. 2019లో ఫాస్ట్‌బౌలర్‌ సయాన్‌ షరిఫ్‌ అతడిని అధిగమించాడు.

ఇదే ఫస్ట్ కేసు:

ఇదే ఫస్ట్ కేసు:

వారం క్రితమే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్‌కి కరోనా వైరస్ వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ పరీక్షల్లో అతనికి నెగటివ్ అని తేలింది. న్యూజిలాండ్‌ స్టార్ పేసర్‌ లాకీ ఫెర్గూసన్‌కు కూడా ఇలానే జరిగింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్‌కి కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. అయితే పరీక్షల్లో అతనికీ నెగటివ్ అని వచ్చింది. కానీ తాజాగా మజిద్ హక్‌కి పాజిటివ్‌గా రావడంతో.. ప్రొఫెషనల్ క్రికెటర్లలో ఇదే ఫస్ట్ కేసుగా నమోదైంది.

Story first published: Saturday, March 21, 2020, 11:42 [IST]
Other articles published on Mar 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+