Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఊహిస్తేనే భయంగా ఉంది.. RCB ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్

డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. టైటిల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సొంతమైదానంలో ఆడుతున్న ఢిల్లీ జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. గత సీజన్‌లోనూ ఢిల్లీ ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలై కప్‌ను చేజార్చుకుంది. ఈసారి కప్‌ను సాధించాలని కసిగా బరిలోకి దిగుతోంది.

Scary to imagine New tension for RCB fans

మరోవైపు లీగ్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ల్లో వరుసగా నెగ్గి ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకొచ్చింది. ముంబైతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుతంగా ఒత్తిడిని జయించింది. ఇదే తరహాలో తుదిపోరులోనూ సత్తాచాటితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ సాధించడం కష్టమేమి కాదు. ఆర్సీబీ మెన్స్ టీమ్‌కు 16 ఏళ్ల నుంచి కప్ కల అందని ద్రాక్షగానే మిగిలింది. ఉమెన్స్ టీమ్ అయినా కప్‌ను ముద్దాడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే ఓ విషయం ఆర్సీబీ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఐపీఎల్ - డబ్ల్యూపీఎల్‌ల్లో కొన్ని విషయాలు కామన్‌గా కనిపిస్తున్నాయి. అవన్నీ యాదృచ్చికంగా జరిగినా బెంగళూరు ఫ్యాన్స్‌ను టెన్షన్‌లో పడేస్తోంది. అసలేం జరిగిదంటే.. ఐపీఎల్ రెండో సీజన్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన బెంగళూరు తుదిపోరుకు చేరుకుంది. టైటిల్ రేసులో డెక్కన్ ఛార్జర్స్ (డీసీ)తో తలపడి ఓటమిపాలై కప్‌ను చేజార్చుకుంది.

ప్రస్తుత డబ్ల్యూపీఎల్-2లోనూ ఆర్సీబీ మూడో స్థానంలో నిలిచింది. ఫైనల్‌కూ అర్హత సాధించింది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్ రెండో సీజన్ ఫైనల్‌లో డీసీ (డెక్కన్ ఛార్జర్స్) చేతిలో ఆర్సీబీ ఓడినట్లుగానే ఈ సారి డీసీ (ఢిల్లీ క్యాపిటల్స్) జట్టుతో పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుందేమో అని నెట్టింట్లో చర్చ మొదలైంది. మరి, నెటిజన్లు ఊహాగానాలు నిజమవుతాయో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.

Story first published: Sunday, March 17, 2024, 11:42 [IST]
Other articles published on Mar 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+