న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ కొత్త అంబుడ్స్‌మన్‌గా సుప్రీం కోర్టు మాజీ జడ్జి డీకే జైన్

SC appoints former judge Justice D.K. Jain as BCCI ombudsman

హైదరాబాద్: బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి డీకే జైన్‌ను సుప్రీంకోర్టు నియమించింది. జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, ఏఎం సప్రే సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. బీసీసీఐ కొత్త రాజ్యాంగం నిబంధనల ప్రకారం సర్వోన్నత న్యాయస్థానం డీకే జైన్‌ పేరును ఖరారు చేసింది.

<strong>కార్గిల్ సమయంలోనే గెలిచాం... పోరాడకుండా లొంగిపోతారా?: భారత్-పాక్ మ్యాచ్‌పై థరూర్</strong>కార్గిల్ సమయంలోనే గెలిచాం... పోరాడకుండా లొంగిపోతారా?: భారత్-పాక్ మ్యాచ్‌పై థరూర్

బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం సర్వసభ్య సమావేశంతోపాటు బోర్డు ఎన్నికకు ముందుగా విచారణాధికారి నియామకం పూర్తి చేయాలని సుప్రీం నియమిత పాలకుల కమిటీ(సీఓఏ) చెప్పడంతో గురువారం డీకే జైన్ పేరుకు ఓకే చెప్పింది. దీంతో పాటు కొత్త సీఓఏ సభ్యుడిగా లెఫ్టినెంట్ జనరల్ రవి తోడ్గేని నియమించింది.

గతంలో వినోద్‌ రాయ్‌ నేతృత్వంలో నలుగురు సభ్యులతో బీసీసీఐ పరిపాలకుల కమిటీని సుప్రీంకోర్టు నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నుంచి రామచంద్ర గుహ, విక్రమ్ లిమాయే తప్పుకోవడంతో అమికస్‌క్యూరీ నర్సింహ బెంచ్ దృష్టికి తీసుకురావడంతో రవి తోడ్గేను మూడో సభ్యుడిగా సుప్రీం బెంచ్ తాజాగా నియమించింది.

"పరిపాలకుల కమిటీ ముఖ్యమైంది. అందుకే మూడో సభ్యుడిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ రవి తొడ్గెను నియమించడం సబబుగా ఉంటుందని మేం భావిస్తున్నాం" అని సుప్రీం కోర్టు వెల్లడించింది. మరోవైపు బీసీసీఐ, రాష్ట్ర సంఘాలు, ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు, ఆటగాళ్లకు సంబంధించిన వివాదాలను కొత్తగా నియమింపబడ్డ అంబుడ్స్‌మన్‌ పరిష్కరించాల్సి ఉంటుంది.

కాఫీ విత్ కరణ్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లపై ఆయన కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు బీసీసీఐ పాలకుల కమిటీలో సభ్యులుగా ఉన్న వినోద రాయ్, డయానా ఎడుల్జీల పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలను వాళ్లు బయటికి రానివ్వకూడదని చెప్పింది.

Story first published: Friday, February 22, 2019, 13:13 [IST]
Other articles published on Feb 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X