Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సఫారీ గడ్డపై ఓ చెత్త రికార్డుని నమోదు చేసిన రోహిత్ శర్మ

SAvIND, 3rd ODI: Is Rohit Sharma one of India's worst overseas batsman ever? Here's a telling stat

హైదరాబాద్: సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ద్వైపాక్షిక సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసపెట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంటే, ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ఫామ్‌ కోసం నానా తంటాలు పడుతున్నాడు. క్రీజులో కుదురుకోవడానికే అపసోపాలు పడుతున్నాడు.

ముఖ్యంగా కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ ఔటైన తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత దక్షిణాఫ్రికా పర్యటనలో ఆతిథ్య జట్టు పేస్ బౌలర్ కగిసో రబాడ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ ఐదు సార్లు ఔటయ్యాడు. ఆ క్రమంలోనే ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో దక్షిణాఫ్రికాలో ఆ జట్టుపై అత్యంత చెత్త యావరేజ్‌ను నమోదు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఆరు వన్డేల సిరిస్‌లో భారత్‌ గెలిచిన మూడు వన్డేల్లో ఆడిన రోహిత్‌ శర్మ మొత్తం 35 పరుగులు మాత్రమే చేశాడు. తొలి వన్డేలో 20 పరుగులు చేసిన రోహిత్‌.. రెండో వన్డేలో 15 పరుగులు చేశాడు.

ఇక మూడో వన్డేలో డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. వన్డే పర్యటనకు ముందు జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కూడా రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో కనీసం ఏడు ఇన్నింగ్స్‌లు ఆడిన భారత ఆటగాళ్లలో సఫారీ గడ్డపై చెత్త యావరేజ్‌ నమోదు చేసిన క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు.

చెత్త యావరేజిని నమోదు చేసిన భారత ఆటగాళ్లు:
1. Rohit Sharma in South Africa - 12.10
2. Ajit Agarkar in India - 15.66
3. Mohammad Kaif in South Africa - 16.81
4. Chandrakant Pandit in India - 18.44
5. Ravindra Jadeja in Australia - 18.45

Story first published: Thursday, February 8, 2018, 16:40 [IST]
Other articles published on Feb 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+