Sachin vs Kohli: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మెచ్చిన క్రికెటర్ ఎవరంటే?

ఢిల్లీ: అమెరికన్ వ్యాపార దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మెచ్చిన క్రికెటర్ భారత మాజీ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అని అంతా అనుకుంటారు. అయితే ఆయనకు సచిన్‌తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇష్టమేనట. సచిన్ ఒకప్పుడు తన అభిమాన క్రికెటర్ అని, ప్రస్తుతం తనకు కోహ్లీ బ్యాటింగ్ శైలి నచ్చుతుందని తెలిపారు. 'మైక్రోసాఫ్ట్' దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన 'యంగ్ ఇన్నోవేటర్స్ సమ్మిట్' లో ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల పాల్గొన్నారు.

నిన్న సచిన్, నేడు కోహ్లీ:
'యంగ్ ఇన్నోవేటర్స్ సమ్మిట్'లో పాల్గొన్న సత్య నాదెళ్లను మీ అభిమాన క్రికెటర్ ఎవరు అని మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడు అనంత్ మహేశ్వరి ప్రశ్నించారు. 'నాకు నిన్న అయితే సచిన్, నేడు కోహ్లీ అని చెబుతాను' అని ఆయన సమాధానం ఇచ్చారు. ఆయన రాసిన 'హిట్ రీఫ్రెష్' అనే పుస్తకంలో తనపై క్రికెట్ ఎంత ప్రభావం చూపిందో తెలిపారు. టీమ్ వర్క్, గెలుపోటములు వంటివి క్రికెట్ నుంచే నేర్చుకున్నా అని సత్య తన పుస్తకంలో రాశారు.

కెట్‌కు కోడింగ్ చేయటం అంటే ఇష్టం:
నాకు క్రికెట్‌కు కోడింగ్ చేయటం అంటే చాలా ఇష్టం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను ఉపయోగించే సెన్సార్స్ ద్వారా క్రికెట్ బ్యాట్‌లను తయారుచేసే స్టార్టప్ అనిల్ కుంబ్లేకు ఉంది. నేను ఆయనను కలిసాను. అవసరాలకు అనుగుణంగా తనను తాను మార్చుకునే లక్షణం కలిగిన కోడింగ్‌కు మంచి భవిష్యత్తు ఉంది' అని సత్య అన్నారు. కోడింగ్ కవిత్వం లాంటిది. ఇది రకరకాల భావాల సమ్మేళనం. కోడింగ్ మీకు ప్రేరణనిస్తుందని తెలిపారు.

జయసింహనే ఇష్టం:
కోహ్లీ, సచిన్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన ఎంఎల్ జయసింహ అనే క్రికెటర్ అంటే కూడా సత్య నాదెళ్లకు ఎంతో ఇష్టం. సత్య రాసిన హిట్ రీఫ్రెష్ పుస్తక ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. జయసింహ, సచిన్ టెండూల్కర్.. వీరిద్దరిలో నీ ఫేవరెట్ ఎవరనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ .. 'కష్టమైన ప్రశ్నే వేశారు. కానీ.. నేను హైదరాబాదీని కాబట్టి నా ఓటు జయసింహకే' అని పేర్కొన్నారు.

రోహిత్ ఆటను చూస్తుంటే:
ఇక టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆటను చూస్తుంటే మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆట గుర్తొస్తుందని గతంలో సత్య అన్నారు. 'రోహిత్ శర్మ ఆడుతుంటే చూడటం నాకెంతో ఇష్టం. అతని కవర్ డ్రైవ్స్ చూస్తే నాకు వీవీఎస్ లక్ష్మణ్ గుర్తుకొస్తాడు. రోహిత్ అద్భుత ఫామ్‌తో ఆడుతుంటే మరింత అందంగా కనిపిస్తాడు' అని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications