'నాకు ఇష్టమైన నిక్ నేమ్ అదే'.. తెలుగోళ్లంటే కేన్ మామకు ఎంత ప్రేమో!
మనుషుల్ని కలుపుకునే విషయంలో లేదా ఆరాధించే విషయంలో మన తెలుగువారికి ఓ అలవాటు ఉంది. అది ఏంటంటే.. వాళ్లకు సాధరణంగానే ఓ పట్టాన ఎవరూ అంత ఈజీగా నచ్చరు.. కానీ ఒక్కసారి నచ్చితే మాత్రం వారిని అస్సలు వదలుకోరు. తల మీద పెట్టుకుని ఆరాధిస్తారు. క్రికెటర్స్ విషయంలోనైనా అంతే. అయితే భారత క్రికెటర్లు కాకుండా విదేశీ ప్లేయర్స్ లో మనోళ్లు ఎవరినైనా ఎక్కువ ఆదరించారంటే అది డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సనే అని చెప్పాలి.
గతంలో ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వీరిద్దరూ తెలుగువాళ్ల అభిమానాన్ని చూరగొన్నారు. అయితే వార్నర్ విషయం కాసేపు పక్కనపెడితే.. విలియమ్సన్ ను మనవాళ్లు ముద్దుగా కేన్ మామ అని పిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. సందర్భంగా ఏదైనా కేన్ మామ అని అంటుంటారు. అంతలా తెలుగువారి మదిలో స్థానాన్ని సంపాదించుకున్నాడతడు.

అయితే తాజాగా కేన్.. ఇండియన్స్ తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడాడు. తన ఫేవరెట్ నిక్ నేమ్ కూడా కేన్ మామ అని చెప్పాడు. ఈ పేరును పెట్టింది మన తెలుగోళ్లే కావడం విశేషం. ప్రస్తుతం కేన్ విలియమ్సన్.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న దర్బన్ సూపర్ జెయింట్స్ జట్టులోని మరో సభ్యుడు హెన్రిచ్ క్లాసిన్ తో.. చిట్ చాట్ సెషన్ లో పాల్గొన్నాడు కేన్. ఇందులో 'నీకు బాగా నచ్చిన, ఇష్టమైన నిక్ నేమ్ ఏంటి?' అని కేన్ విలియమ్సన్ ను ప్రశ్నించాడు హెన్రీచ్ క్లాసిన్. దానికి కేన్.. 'ఇండియాలో నన్ను కేన్ మామ అని పిలుస్తారు. అలా పిలుస్తే నాకెంతో ఇష్టం' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సమాధానం భారత క్రికెట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
కాగా, టీమ్ మేనేజ్‌మెంట్‌తో మనస్పర్థల కారణంగా డేవిడ్ వార్నర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దూరం అవ్వగా.. ఫామ్ కోల్పోయిన నేపథ్యంలో కేన్ ను ఆరెంజ్ ఆర్మి దూరం పెట్టేసింది.
Story first published: Thursday, February 6, 2025, 14:48 [IST]
Other articles published on Feb 6, 2025
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications