సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 ఎడిషన్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే తాజాగా సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ జట్టుకు జొబర్గ్ సూపర్ కింగ్స్ బోనస్ షాకిచ్చింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకేసింది.
తాజాగా జరిగిన మ్యాచ్ లో జొబర్గ్ సూపర్ కింగ్స్ - సన్‌రైజర్స్ తలపడ్డాయి. ఈ పోరులో సన్ రైజర్స్ ఘోర పరాజయాన్ని అందుకుంది. మొదట టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ బ్యాటింగ్ కు దిగింది. కానీ జొబర్గ్ బౌలర్ల దెబ్బకు 118 పరుగులకే చాప చుట్టేసింది. ఓపెనర్ బెడింగ్‌హాం(40) వికెట్ కీపర్ ట్రిస్టన్ స్టబ్స్(37), మార్కో జాన్సెన్(22) పర్వాలేదనిపించారు. మిగతా వారు విఫలమయ్యారు. జొబర్గ్ బౌలర్లలో విల్‌జోన్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. సిపామ్ల మూడు వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్ తాహిర్, మతీశ పతిరణ ఒక్కో వికెట్ తీశారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జొబర్గ్ సూపర్ కింగ్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(15) ప్రారంభంలోనే పెవిలియన్ చేరాడు. కానీ మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 56 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ లూబే(25) రాణించాడు. దీంతో మరో 6 ఓవర్లు మిగిలి ఉండగానే జొబర్గ్ లక్ష్యాన్ని ఛేదించింది. తొమ్మిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ విజయం సాధించింది. అదనపు పాయింట్‌ను కూడా అందుకుంది.
పాయింట్ల కేటాయింపు ఇలా
మ్యాచ్ లో విజయం సాధిస్తే నాలుగు పాయింట్లు లభిస్తాయి. ఓడిపోతే పాయింట్లేమీ రావు. ఫలితం తేలకపోతే రెండు పాయింట్లు కేటాయిస్తారు. అదే గెలిచిన- ఓడిన జట్టు మధ్య రన్‌రేటు 1.25 రెట్లు తేడా ఉంటే మాత్రం.. అదనంగా మరో బోనస్ పాయింట్ ఇస్తారు. అందుకే తాజా మ్యాచ్ లో జొబర్గ్ బోనస్ పాయింట్ సాధించింది. తద్వారా 15 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. మరోవైపు పర్ల్ రాయల్స్ ఇప్పటికే 24 పాయింట్లతో అగ్రస్థానం సంపాదించి, ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.
వరుస విజయాలకు బ్రేక్
ఈ లీగ్ లో తన తొలి మ్యాచ్ ను ఓటమితో ప్రయాణాన్ని ఆరంభించింది సన్ రైజర్స్. ఆ తర్వాత ప్రిటోరియా క్యాపిటల్స్‌పై ఓడింది. అనంతరం వరుసగా నాలుగు విజయాలను సాధించింది.
అయితే ఇప్పుడా వరుస విజయాలకు జొబర్గ్ అడ్డుకట్ట వేసింది.