For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SAT20: కావ్యపాప బుంగమూతి .. సన్ రైజర్స్ ఓటమి - ముంబయి ఘన విజయం

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025 విజేత‌గా ఎంఐ కేప్‌టౌన్ అవతరించింది. తాజాగా జరిగిన ఫైన‌ల్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను 76 ప‌రుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా తొలి సారి సౌతాఫ్రికా టీ20 లీగ్‌ లో టైటిల్‌ను ముద్దాడింది.

కగిసో రబాడ్ దెబ్బకు సన్ రైజర్స్ విలవిల

వరుసగా మూడోసారి ఛాంపియన్స్‌గా నిలిచి.. టైటిల్ ముద్దాడలన్న సన్‌రైజర్స్‌ ఈస్టర్న్ కేప్ కు సౌతాఫ్రికా టీ20 లీగ్ లో నిరాశ ఎదురైంది. సన్ రైజర్స్ ను ఎంఐ కేప్‌టౌన్‌ దెబ్బకొట్టింది. 182 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌​ 18.4 ఓవర్లలో 105 పరుగులకే చాట చుట్టేసింది. ఎంఐ బౌలర్లు సన్ రైజర్స్ ను బెంబేలెత్తించారు. దీంతో సన్ రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టామ్‌ అబెల్‌(30),టోనీ డిజోర్జే(26) పర్వాలేదనిపించగా.. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఎంఐ బౌలర్లలో కగిసో రబాడ నాలుగు వికెట్లతో చెలరేగి ఆడారు. బౌల్ట్‌, లిండే తలో రెండు వికెట్లు పడగొట్టారు. రషీద్‌ ఖాన్‌, కార్బన్‌ బోష్‌ చెరో వికెట్ తీశారు.

SAT20 Champions 2025 MI Cape Town won title and beat two-time winner Sunrisers Eastern Cape kavya maran

అంతకుముందు మొదట బ్యాటింగ్ కు దిగిన ఎంఐ కేప్ టౌన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు ర్యాన్‌ రికెల్టన్‌( 15 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 33), రాస్సీ వాన్‌డర్‌డుస్సెన్‌(23) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు 51 పరుగుల భాగస్వామ్యం , నిర్మించారు. ఎస్టర్‌హుజెన్‌(39), డెవాల్డ్‌ బ్రెవిస్‌(38) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జానెసన్‌, డాసన్‌, గ్లీసన్‌ తలో రెండు వికెట్లు తీశారు. మార్‌క్రమ్‌, ఓవర్టన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌గా జాన్సెన్‌..
ఈ టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సెన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ అవార్డును అందుకున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 204 పరుగులు చేసిన అతడు.. 18.42 యావరేజ్ తో 19 వికెట్లు తీశాడు.

Story first published: Sunday, February 9, 2025, 9:12 [IST]
Other articles published on Feb 9, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+