For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్: దిమ్మదిరిగిన పాక్, ఫైనల్‌కు బంగ్లా

By Pratap

మిర్పూర్‌: ట్వంటీ20 ఆసియా కప్ పోటీల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు షాకిచ్చింది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంకను ఓడించిన బంగ్లాదేశ్ పాక్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్ మ్యాచులో భారత్‌తో తలపడడానికి బంగ్లాదేశ్ సిద్ధమైంది.

బుధవారం రాత్రి అత్యంత అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లా ఐదు వికెట్లతో అఫ్రీది సేనను బంగ్లా చిత్తు చేసింది. పాక్‌ నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా మరో ఐదు బంతులు మిగిలుండగానే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ సౌమ్య సర్కార్‌ (48) గట్టి పునాది వేయగా, ఆఖర్లో మహ్మదుల్లా (15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 22 నాటౌట్‌), కెప్టెన్‌ మష్రఫే మోర్తజా (7 బంతుల్లో 2 ఫోర్లతో 12 నాటౌట్‌) మెరుపులు మెరిపించి విజయాన్ని సాధించి పెట్టారు. పాక్‌ బౌలర్లలో మహమ్మద్‌ ఆమిర్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 129 పరుగులు చేసింది. సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ (42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతో సత్తా చాటాడు. షోయబ్‌ మాలిక్‌ (30 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 41) రాణించాడు. ఖుర్రమ్‌ మంజూర్‌ (1), మహమ్మద్‌ హఫీజ్‌ (2), ఉమర్‌ అక్మల్‌ (4), షర్జీల్‌ ఖాన్‌ (10), కెప్టెన్‌ అఫ్రీది (0) తీవ్రంగా నిరాశ పరిచారు.

 Sarkar, Mortaza guide Bangladesh to final

ఓ దశలో 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును సర్ఫ్‌రాజ్‌, మాలిక్‌ ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 70 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రద స్కోరందించారు. బంగ్లా బౌలర్లలో అల్‌-అమిన్‌ హుస్సేన్‌ మూడు, అరాఫత్ సన్నీ రెండు వికెట్లు పడగొట్టారు. సౌమ్య సర్కార్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఆరు పాయింట్లతో బంగ్లా ఫైనల్‌ బెర్తు దక్కించుకుంది. ఆసియా కప్‌లో బంగ్లా ఫైనల్‌కు చేరడం ఇది రెండో సారి. 2012లోనూ ఫైనల్‌కు చేరుకున్న బంగ్లాదేశ్ తుదిపోరులో పాక్‌ చేతిలో ఓడిపోయింది. ఇక ఇప్పటికే ఫైనల్‌ ప్రత్యర్థులు తేలిపోయినందున శుక్రవారం పాకిస్థాన్‌-శ్రీలంక మ్యాచ్‌ నామమాత్రమే కానుంది. ఆదివారం భారత-బంగ్లా మధ్య అంతిమ పోరు జరగనుంది.

 Sarkar, Mortaza guide Bangladesh to final


లక్ష్యఛేదనలో సౌమ్య సర్కార్‌ మంచి పునాది వేయడంతో ఓ దశలో 83/2 స్కోరుతో నిలిచిన బంగ్లాదేశ్ సులభంగా మ్యాచ్‌ నెగ్గేలా కనిపించింది. కానీ, సర్కార్‌, ముష్ఫికర్‌ రహీమ్‌ (14) వరుస ఓవర్లలో అవుటవడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. చివరి ఐదు ఓవర్లలో బంగ్లా విజయానికి 40 పరుగులు అవసరమయ్యాయి. 16వ ఓవర్లో ఐదే పరుగులు రాగా, తర్వాతి ఓవర్లో షకీబల్‌ సిక్సర్‌ కొట్టడంతో 9 పరుగులకు చేరాయి. దీంతో సమీకరణం చివరి 18 బంతుల్లో 26 పరుగులుగా మారింది.

అయితే సమీని కాదని 18వ ఓవర్లో ఆమిర్‌కు కెప్టెన్‌ బంతిని అప్పగించాడు. రెండో బంతికి స్కూప్‌ షాట్‌ ఆడబోయిన షకీబల్‌ (8) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. కానీ, తర్వాతి రెండు బంతులను మోర్తజా బౌండ్రీకి తరలించాడు.

 Sarkar, Mortaza guide Bangladesh to final

చివరి రెండు ఓవర్లలో బంగ్లాకు 18 పరుగులు అవసరమయ్యాయి. బంతి అందుకున్న సమీ 19వ ఓవర్‌ తొలి మూడు బంతులకు మూడు సింగిల్స్‌ ఇవ్వడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. నాలుగో బంతికి మోర్తజా భారీ షాట్‌ ఆడి బౌండ్రీలైన్‌ వద్ద ఫీల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కానీ, అది నోబాల్ అయింది‌. అప్పటికే మోర్తజా డబుల్‌ తీశాడు.

తర్వాతి రెండు బంతుల్లో మరో మూడు పరుగులు వచ్చాయి. ఈ దశలో సమీ మరో నోబాల్‌ వేశాడు. దాన్ని మహ్మదుల్లా బౌండ్రీకి తరలించాడు. చివరి బంతికి సింగిల్‌ తీశాడు. ఈ ఓవర్లో 15 పరుగులు ఇచ్చిన సమీ మ్యాచ్‌ను పాక్‌ నుంచి దూరం చేశాడు. ఇక చివరి ఓవర్‌ తొలి బంతికే మహ్మదుల్లా ఫోర్‌ బాదడంతో విజయం బంగ్లాదేశ్ సొంతమైంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+