
న్యూ ఢిల్లీ: ఏదో ఒక టోర్నీలో ధోనీని కాపీ కొట్టి దొరికిపోయే పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్‌ని ఔట్ చేసేందుకు మహేంద్రసింగ్ ధోనీ.. స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ ధావన్‌ని స్క్వేర్ లెగ్‌లోకి మార్చగా.. తర్వాత బంతికే ధావన్‌కు షకీబ్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఇదే ప్లాన్‌ని బుధవారం రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కాపీ కొట్టిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌ని వేరొక చోటికి మార్చాడు. కానీ.. రెండు బంతుల వ్యవధిలోనే స్లిప్‌లో గాల్లోకి లేచిన బంతి బౌండరీకి వెళ్లింది. ఒకవేళ ఆ ఫీల్డర్ అక్కడే ఉండి ఉంటే.. పాక్‌కి ఓ వికెట్ లభించేది. ఇప్పుడు ఆ ఫీల్డింగ్ మార్పు వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
అంతటి ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఎట్టకేలకు బంగ్లాదేశ్.. పాకిస్థాన్‌ను 37 పరుగుల తేడాతో ఓడించింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లా నిర్దేశించిన 240 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ తడబడింది. 18 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో పసికూనగా భావించి అఫ్గనిస్తాన్‌తో తలపడిన భారత్ ఫలితంతో సంతృప్తి లభించలేదు.
చేధనకు దిగిన టీమిండియా 252 పరుగుల వద్ద ఒక్క బంతి మిగిలి ఉండగానే ఆలౌట్‌కు గురి అయింది. దీంతో భారత్ మ్యాచ్‌ను టైగా ముగించగా.. ఫైనల్‌లో గెలిచి టోర్నీని సొంతం చేసుకోవాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. ఈ క్రమంలో జట్టు వైస్ కెప్టెన్ ధావన్ టీమిండియాకు కొన్ని సూచనలు, హెచ్చరికలు అందజేశాడు.