Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనిని మా ఆయన ఆరాధిస్తాడు: పాక్ టీ20 కెప్టెన్ భార్య

ముంబై: టీమిండియా టీ20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, అతని భార్య సాక్షిని ఎంతగానో ఆరాధిస్తాడని ఇటీవలే పాకిస్థాన్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన సర్ఫరాజ్ అహ్మాద్ భార్య వెల్లడించింది. ఐసీసీ వరల్డ్ టీ20 అనంతరం షాహిద్ అఫ్రీదీని తొలగించి అతడి స్థానంలో 29 ఏళ్ల సర్ఫారాజ్‌కు టీ20 కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.

టీమిండియా వన్డే కెప్టెన్ ధోని లాగే సర్ఫారాజ్ కూడా బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ చేస్తాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ భార్య సైదా కుష్బుక్త్ ధోనితో తన భర్తను పోలుస్తూ ప్రశంసలు కురిపించింది. ధోనిని ఓ లివింగ్ లెజండ్‌గా పేర్కొన్న ఆమె ధోని నుంచి సర్ఫరాజ్ కూడా ఎన్నో మంచి విషయాలను నేర్చుకున్నాడని చెప్పుకొచ్చారు.

ఇక ధోని భార్య సాక్షి అందరికీ బాగా తెలిసిన ముఖమని, ఆమెను ఎంతగానో ఆరాధించేదానని పేర్కొన్నారు. ధోనికి ఆమె ఓ అదృష్ట దేవతగా అభివర్ణించింది. మ్యాచ్ జరిగే సమయంలో బాక్సులో ఆమెను ఎప్పుడైనా కలవాల్సి వస్తే కలవాల్సి నాకు నిజంగానే మాటలు రావని చెప్పింది.

Sarfraz Ahmed has adopted many good things from MS Dhoni, says his wife

దీనిని బట్టి చూస్తుంటే పాకిస్థాన్ టీ20 కెప్టెన్ సర్ఫరాజ్‌కు సైదా తనంతట తానే అదృష్ట దేవతగా అభివర్ణించుకుంటుంది. నిజానికి పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్సీగా ఉండాలనేది సర్ఫరాజ్‌కు ఉన్న డ్రీమ్‌ అని ఆమె చెప్పారు. మంగళవారం పీసీపీ ఛైర్మన్ షహార్యార్ ఖాన్ ఫోన్ చేసి టీ20 కెప్టెన్‌గా తనని ఎంపిక చేశారని చెప్పడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు.

నిజానికి పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు వహించడం అంటే పీకమీద కత్తి పెట్టుకుని ఉన్నట్లే. అయితే తన భర్తకు ఆ గట్స్ ఉన్నాయని ఇటీవల జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (సీపీఎల్)లో ఆ విషయాన్ని రుజువైందని ఆమె ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ జట్టును మళ్లీ తిరిగి వరల్డ్ ఛాంపియన్‌గా నిలపడంతో తన భర్తకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+