For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థానీ క్రికెటర్ అత్యుత్సాహం.. మెడ పట్టేసింది

 Sarfraz Ahmed chuckles as Hasan Alis bomb explosion celebration goes terribly wrong - Watch

హైదరాబాద్: సహజంగానే వికెట్ తీయగానే బౌలర్లు తమ సంతోషాన్ని వ్యక్తం పలు రకాలుగా వ్యక్తం చేస్తుంటారు. కొందరైతే అమితానందాన్ని వ్యక్తం చేస్తూ.. డ్యాన్సులు కూడా చేస్తుంటారు. ఇందులో బ్రావోను ప్రముఖంగా చెప్పాలి. అయితే సాధారణంగానే వివాదాలకు కేంద్ర బిందువైన పాకిస్థాన్ క్రికెటర్లు మరీ విపరీత ధోరణిలో వ్యక్తపరుస్తుంటారు. ఇలానే జింబాబ్వే-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న వన్డేలో హసన్ అలీ.. జింబాబ్వే బ్యాట్స్‌మెన్ వికెట్ పడగొట్టాడు.

ఆ సంతోషంలోనే కండరాలు పట్టేసేంతలా ఒక్కసారిగా రెండు చేతులు చాపి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దాంతో.. ఒక్కసారిగా అతని మెడ పట్టేయడంతో. నేలపై కూర్చుండిపోయాడు. వికెట్ పడిన ఆనందంలో అతని దగ్గరికి వస్తున్న మిగిలిన క్రికెటర్లు అతనిని చూసి ఆందోళన వ్యక్తం చేయగా.. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం.. నవ్వును దాచుకుంటూ అతనిని చేరుకున్నాడు.

అయితే కాసేపటి తర్వాత మళ్లీ బౌలింగ్ చేసిన హసన్ అలీ.. యథావిధిగా కనిపించాడు. హాస్యాస్పదంగా సాగిన ఈ వీడియో సన్నివేశం నెట్టింట్లో హల్‌చల్ చేస్తుండటంతో.. అటు కెప్టెన్‌పై విమర్శలు గుప్పిస్తూనే దీనిని బట్టి అతను కాస్త సంబరాల తీవ్రతను తగ్గించుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. గతేడాది జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలోనూ హసన్ అలీ ఇదే విధంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఆ టోర్నమెంట్‌లో అలీ 13వికెట్లు తీయగలిగాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (117 నాటౌట్‌; 16 ఫోర్లు) అజేయ సెంచరీతో జింబాబ్వేతో రెండో వన్డేలో పాకిస్తాన్‌ 9 వికెట్లతో గెలిచింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌ బౌలర్లు ఉస్మాన్‌ (4/36), హసన్‌ అలీ (3/32) ధాటికి జింబాబ్వే 49.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పాక్‌ 36 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 195 పరుగులు చేసి గెలిచింది. ఫఖర్‌ జమాన్‌... ఇమాముల్‌ హక్‌ (44)తో తొలి వికెట్‌కు 119 పరుగులు, ఆజమ్‌ (29 నాటౌట్‌)తో రెండో వికెట్‌కు 76 పరుగులు జోడించాడు.

Story first published: Wednesday, July 18, 2018, 11:34 [IST]
Other articles published on Jul 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+