Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sarfaraz Khan : సచిన్ కొడుకుతో పోల్చుకున్న సర్ఫరాజ్.. అది విని బాధపడ్డానన్న తండ్రి!

Sarfaraz Khan was envious of Arjun Tendulkar when he was young

ప్రస్తుతం భారత క్రీడాభిమానుల నోళ్లలో నానుతున్న పేరు సర్ఫరాజ్ ఖాన్. దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న ఈ ముంబై ఆటగాడిని టీమిండియాలోకి ఎంపిక చేయకపోవడం పెద్ద దుమారమే రేపింది.

అతన్ని పక్కనపెట్టి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి వారిని ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయడంతో క్రీడాభిమానులు, మాజీలు కూడా మండి పడుతున్నారు. ఈ క్రమంలోనే సర్ఫరాజ్ కూడా టీమిండియా సెలెక్షన్ కమిటీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఆస్ట్రేలియా సిరీస్‌లో మొండిచెయ్యి

ఆస్ట్రేలియా సిరీస్‌లో మొండిచెయ్యి

తనను బంగ్లాదేశ్ సిరీస్‌లోనే సెలెక్ట్ చేస్తామని సెలెక్షన్ కమిటీ చీఫ్ చేతన్ శర్మ మాటిచ్చాడని, కానీ చివరకు హ్యాండిచ్చాడని సర్ఫరాజ్ ఖాన్ చెప్పాడు. ఆ తర్వాత కలిసినప్పుడు 'నీకూ ఛాన్స్ వస్తుంది. వెయిట్ చెయ్' అని వెళ్లిపోయాడని తెలిపాడు. ఇది విన్న తర్వాత సెలెక్షన్ కమిటీపై ఫ్యాన్స్ మరింత అక్కసు వెళ్లగక్కారు. ఆస్ట్రేలియా సిరీస్‌కు పక్కన పెట్టినా కూడా సర్ఫరాజ్ కుంగిపోలేదు. ఈ సిరీస్‌కు టీమిండియాను ప్రకటించిన రోజుల వ్యవధిలోనే రంజీ ట్రోఫీలో మరో సెంచరీ చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకైనా అతన్ని ఎంపిక చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.

సచిన్ కొడుకుతో ఎక్కువగా ఆడేవాడు..

సచిన్ కొడుకుతో ఎక్కువగా ఆడేవాడు..

ఇలాంటి సమయంలో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. చిన్న తనం నుంచి చిన్నా చితకా పనులు చేస్తూ కొడుకును క్రికెటర్‌ను చేశాడతను. ఈ క్రమంలో ఒకసారి కొడుకు అన్న మాటలు విని తన నోట మాట రాలేదని గుర్తుచేసుకున్నాడు. క్రికెట్ దేవుడుగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌తో సర్ఫరాజ్ చిన్నతనంలో ఎక్కువ క్రికెట్ ఆడాల్సి వచ్చింది. అయితే అర్జున్‌తో కలిసి, లేదా అతని ప్రత్యర్థిగా ఆడేవాడు. ఈ క్రమంలోనే ఒకసారి తండ్రితో సర్ఫరాజ్ ఈ విషయం చెప్పాడట.

అర్జున్ కన్నా లక్కీ..

అర్జున్ కన్నా లక్కీ..

అర్జున్ గురించి తండ్రికి చెప్తూ.. 'ఆ అర్జున్ టెండూల్కర్ ఎంత లక్కీనో కదా నాన్న. తను సచిన్ కొడుకు. అతని దగ్గర అన్నీ ఉన్నాయి. కార్లు, ఐప్యాడ్లు.. అన్నీ' అన్నాడట సర్ఫరాజ్. అతనికి ఏం సమాధానం చెప్పాలో కూడా తనకు తెలియలేదని నౌషద్ ఖాన్ గుర్తుచేసుకున్నాడు. అయితే ఆ మాటలు అన్న కాసేపటికే తన వద్దకు పరిగెత్తుకొచ్చిన సర్ఫరాజ్.. 'అన్నీ ఉన్నా వాళ్ల నాన్న అర్జున్‌తో ఎక్కువ సేపు గడపలేడు. కానీ నువ్వు మాత్రం నాతో రోజంతా గడుపుతావు. నేనే అర్జున్ కన్నా లక్కీ కదా' అని చెప్పాడట.

Story first published: Sunday, January 22, 2023, 21:28 [IST]
Other articles published on Jan 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+