Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji Trophy: ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో బ్రాడ్‌మాన్ తర్వాత అరుదైన రికార్డ్ సాధించిన సర్ఫరాజ్ ఖాన్

Sarfaraz Khan is the highest average Indian player in first-class cricket

ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో సర్ఫరాజ్ ఖాన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు అత్యధిక సగటు నమోదు చేసిన ఇండియన్ ప్లేయర్‌గా ఖాన్ నిలిచాడు. ఇక రంజీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడుతున్న సర్ఫరాజ్ క్వార్టర్‌ ఫైనల్లో భాగంగా ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో అతడు (153పరుగులు) సెంచరీ సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెకండ్ డే అతను సెంచరీ సాధించి ఈ ఫీట్ సాధించాడు. ఇక ఈ సీజన్‌లో మూడో సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా కూడా నిలిచాడు. ఇక ఇప్పటి వరకు అతడు అయిదు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 704పరుగులు చేయడం విశేషం. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. ముంబై జట్టు క్వార్టర్ ఫైనల్ చేరడానికి తన విలువైన ఇన్నింగ్స్‌లతో సర్ఫరాజ్ తోడ్పడ్డాడు. ఇక క్వార్టర్‌ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టి.. ముంబై ముందంజ వేసేలా చేశాడు.

గత (2019-20) సీజన్లో సర్ఫరాజ్ అద్భుత ఫామ్ అందుకుని రాణించాడు. గత సీజన్‌లో 6మ్యాచ్​ల్లో ఒక ట్రిపుల్ సెంచరీ సహా మొత్తం 928పరుగులు చేశాడు. తద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టు ఆల్‌టైమ్‌ గ్రేట్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ సగటు 95.14 తర్వాత రెండో అత్యధిక సగటు 80.42 సర్ఫరాజ్ పేరిట నమోదైంది. ఇక అతను అత్యద్భుతంగా ఆడుతుండడంతో టెస్ట్‌ల్లో అతను టీమిండియాకు సెలక్ట్ అయ్యే అవకాశముంది.

ఉత్తరాఖండ్‌‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ 205బంతుల్లో 4 సిక్సర్లు, 14ఫోర్లతో 153 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీకి తోడు ముంబై తరఫున అరంగేట్రం చేసిన సువెద్ పార్కర్ కూడా అద్భుతంగా ఆడాడు. ఈ క్రమంలో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా అతను నిలిచాడు. అతను 447బంతుల్లో 21ఫోర్లు, 4సిక్సర్లతో 252పరుగులు చేసి.. ముంబై తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ముంబై తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి 8వికెట్లు కోల్పోయి 647పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది. ఇక బ్యాటింగ్ కు దిగిన ఉత్తరాఖండ్ 2వికెట్లు కోల్పోయి 39పరుగులు చేసింది.

Story first published: Tuesday, June 7, 2022, 21:47 [IST]
Other articles published on Jun 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+