రీఎంట్రీపై కన్నేసిన మాజీ కెప్టెన్.. ఇందు కోసం ఎం చేస్తున్నాడంటే?!!

కరాచీ: రెండు వారాల క్రితం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 2020-21 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితాను ప్రకటించగా.. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ క్యాటగిరీ 'బి'కి పడిపోయాడు. గతేడాది కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో సర్ఫరాజ్ క్యాటగిరీ 'ఏ' నుండి 'బి'కి వచ్చాడు. గత ఏడాది అక్టోబరులో పేలవ ఫామ్, ఫిట్‌నెస్ కారణంగా కెప్టెన్సీతో పాటు జట్టులోనూ చోటు కోల్పోయిన విషయం తెలిసిందే.

కాంట్రాక్టులను పట్టించుకోను:
ఎలాగైనా ఫామ్ అందుకుని ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటనకి ఎంపికవ్వాలని సర్ఫరాజ్ అహ్మద్ ఆశిస్తున్నాడు. ఇందుకోసం లాక్‌డౌన్ సమయంలోనూ ఇంట్లోనే ఫిట్‌నెస్ మెరుగుపర్చుకునే పనిలో పడ్డాడు. తాజాగా టైమ్స్ నౌతో సర్ఫరాజ్ మాట్లాడుతూ... 'ఏదైనా సాధించడానికి కచ్చితంగా కష్టపడాలి. లక్ష్యం చేరుకోవడం ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. నాకు కేటగిరీ A, B, C గురించి పెద్దగా పట్టింపులు లేవు. అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ జట్టులోకి తిరిగి రావడమే నా ప్రధాన లక్ష్యం' అని అన్నాడు.

జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యం:
'ఒక క్రికెటర్ తన కెరీర్‌లో ఎత్తుపల్లాలను చూస్తాడు. నేను క్యాటగిరీ 'బి'లో ఉన్నందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా లక్ష్యం ఒకటే.. జట్టులో మరలా స్థానం సంపాదించడం కోసం అవకాశాలను వెతుక్కోవడం, జట్టులో సుస్థిర స్థానం సంపాదించడం. కొన్ని నెలలుగా ఫిట్‌నెస్ మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ వేళ ఇంట్లోనే ఫిజికల్ ట్రైనింగ్‌ని కంటిన్యూ చేస్తున్నా. మా ఇంటి ముందు ఉన్న వీధిలో రన్నింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నా' అని సర్ఫరాజ్ చెప్పాడు. ఇంగ్లండ్ పర్యటనకి రెండో వికెట్ కీపర్‌గా సర్ఫరాజ్ ఎంపికయ్యే అవకాశం ఉందని ఇటీవల పాకిస్థాన్ చీఫ్ కోచ్, సెలక్టర్ మిస్బావుల్ హక్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఫిట్‌నెస్ గురించే పెద్ద ఎత్తున చర్చ:
సర్ఫరాజ్ అహ్మద్ ఫామ్ కంటే ఫిట్‌నెస్ గురించే గత ఏడాది కాలంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ల వెనుక సర్ఫరాజ్ ఆవలింతలు తీయడం అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. పాక్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పేలవ ఫిట్‌నెస్ ఉన్న కెప్టెన్ సర్ఫరాజ్ అని ఆ దేశ మాజీలు విమర్శించారు. ఇక ఫాన్స్ అయితే అతడిని జట్టు నుంచి ఇప్పుడే తీసేయాలని పట్టుబట్టారు. ఎన్నో ఏళ్లుగా పాక్‌కు బ్యాట్స్‌మన్, కీపర్, కెప్టెన్‌గా సేవలందిస్తున్న అతడిని కనీసం వన్డేల్లో సారథిగా కొనసాగించాలని మాజీలు అభిప్రాయపడ్డారు. ఆపై సారథి బాధ్యతలు బాబర్ అజామ్‌కు అప్పగించారు.

2016లో టీ20 కెప్టెన్‌గా ఎంపిక:
ఏప్రిల్ 2016న సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్థాన్ జట్టు టీ20 కెప్టెన్‌గా నియమింపబడ్డాడు. ఆ తర్వాత 2017లో వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. 2017లో వెస్టిండిస్ పర్యటనలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించడంతో.. ఆ తర్వాత మూడు ఫార్మాట్లకు అతడినే కెప్టెన్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. కొన్ని అద్భుతాలే చేసినా.. ఆపై ప్రభావం చూపలేక మూల్యం చెల్లనుంచుకున్నాడు. సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్థాన్ జట్టు తరఫున 49 టెస్టులు, 116 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications