For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ఇంట్లో పనోళ్లే ఉండరు.. షాకింగ్ విషయాలు చెప్పిన మాజీ సెలెక్టర్!!

Sarandeep Singh says There are no servants at Virat Kohlis home

ముంబై: మైదానంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో మనందరికీ తెలిసిందే. ప్రత్యర్థి ఆటగాళ్లతో సై అంటే సై అనే రీతిలో వ్యవహరిస్తుంటాడు. దీంతో కోహ్లీని చూసిన వారంతా.. అతడికి చాలా కోపం అని అంచనా వేస్తుంటారు. సోషల్‌ మీడియాలో కూడా నెటిజన్లు రకరకాలుగా విమర్శలు చేస్తుంటారు. ఆఫ్‌ఫీల్డ్‌లో కూడా విరాట్ ఇలానే ఉంటాడా? అంటే కాదు అంటారు అతడి గురించి బాగా తెలిసిన వాళ్లు. ఫీల్డ్‌ బయట విరాట్ ఎంతో ప్రశాంతంగా ఉంటాడట, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం తనదట. తాజాగా ఈ విషయాన్ని భారత మాజీ క్రికెటర్, మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ వెల్లడించాడు.

అందరూ చెప్పేది వింటాడు

అందరూ చెప్పేది వింటాడు

తాజాగా శరణ్‌దీప్ సింగ్ స్పోర్ట్స్ కీదాతో మాట్లాడుతూ... 'మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు విరాట్ కోహ్లీని చూస్తే.. ఎంతో దూకుడుగా కనిపిస్తాడు. కానీ ఆఫ్‌ఫీల్డ్‌లో‌ మాత్రం ఎంతో వినయంగా ఉంటాడు. తను మంచి శ్రోత. సెలక్షన్‌ మీటింగ్స్‌లో అందరూ చెప్పేది చాలా శ్రద్ధగా వింటాడు. గంటన్నర పాటు జరిగే ఈ సమావేశంలో అందరూ చెప్పేది ఎంతో శ్రద్ధగా విని.. ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు' అని తెలిపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతున్న కోహ్లీ.. అహ్మదాబాద్‌లో ఉన్నాడు. ఇరు జట్ల మధ్య అహ్మదాబాద్‌ వేదికగా బుధవారం నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది.

పనోళ్లే ఉండరు

పనోళ్లే ఉండరు

'మైదానం బయట విరాట్ కోహ్లీ వ్యక్తిత్వం విభిన్నంగా ఉంటుంది. విరాట్ భార్య అనుష్క శర్మతో కలిసి ఉండే ఇంట్లో అసలు పనోళ్లే ఉండరు. అతిథులకు విరాట్, అనుష్క భోజనం వడ్డిస్తారు. అంతకంటే ఆతిథ్యం ఏముంటుంది. అంతేకాదు అతను వచినవారితోనే కూర్చుని మాట్లాడతాడు. అతిథులతోనే కలిసి బయటకు విందుకు వస్తాడు. మిగతా ఆటగాళ్లందరికీ కోహ్లీ అంటే ఎంతో గౌరవం. అతను ఎంతో ఎత్తుకు ఎదిగిన చాలా సాధారణంగా ఉంటాడు' అని శరణ్‌దీప్ చెప్పాడు. ఆటతో పాటు ఆదాయంలోనూ గత కొన్నేళ్లుగా కోహ్లీ టాప్‌లో దూసుకెళ్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న టాప్-100 అథ్లెట్స్ జాబితాలో గత ఏడాది 66వ స్థానంలో ఉన్నాడు.

దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తాడు

దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తాడు

'కెప్టెన్‌ అయినందున మైదానంలో విరాట్ కోహ్లీ అలానే ఉండాలి. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు మైదానంలో కోహ్లీ ఎంతో ఒత్తిడిని ఎదుర్కుంటాడు. చాలా సార్లు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దాంతో అతడు దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తాడు' అని భారత మాజీ క్రికెటర్, మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ పేర్కొన్నారు. అనుష్క శర్మతో చాలారోజులు ప్రేమాయణం నడిపిన కోహ్లీ.. 2017 చివరలో ఇద్దరూ ఒకటయ్యారు. పెళ్లి తర్వాత అనుష్క పూర్తిగా సినిమాలు తగ్గించింది. విరుష్క జోడికి ఈ ఏడాది జనవరిలో కూతురు పుట్టింది.

Story first published: Monday, February 22, 2021, 13:25 [IST]
Other articles published on Feb 22, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+