కోహ్లీని సపోర్ట్ చేస్తూ ముగ్గురు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ల వాదన

హైదరాబాద్: కోహ్లీకి వీరాభిమాని. అనుష్క శర్మతో కోహ్లీ వివాహానికి ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో కోహ్లీ ఆమెను తిరస్కరించి అతని బ్యాట్‌ను కూడా బహుమతినిచ్చాడు. ఇప్పుడు తను మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కోహ్లీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మద్దతిస్తున్నానంటూ డ్యాన్స్ చేసి వీడియోను పోస్టు చేసింది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా వెల్లడించి చర్చను లేవదీసింది.

సారా టేలర్ కూడా బెంగళూరు జట్టుకే నా సపోర్ట్:
ఈమెతో పాటుగా ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ అలెగ్జెండ్రా హార్ట్‌లీ కూడా రాయల్ ఛాలెంజర్స్‌కు మద్దతు పలుకుతోంది. ఇంగ్లిష్ వికెట్ కీపర్ సారా టేలర్ కూడా బెంగళూరు జట్టుకే నా సపోర్ట్ అంటూ ఓ అభిమాని చేసిన ట్వీటుకు బదులిచ్చింది.

డికాక్. ఇద్దరూ వికెట్ కీపర్లు కావడంతోనే:
మిగతా వాళ్లంతా కోహ్లి కోసం ఆ జట్టుకు మద్దతునిస్తుంటే.. సారా మాత్రం వేరే ప్లేయర్ కోసం ఆర్‌సీబీకి సపోర్ట్ చేస్తోందట. అతడెవరో కాదు.. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్. ఇద్దరూ వికెట్ కీపర్లు కావడంతోనే ఇలా సపోర్ట్ చేస్తోందని మాత్రం అనుకోవద్దు.
వికెట్ కీపర్ కోసం ఆర్‌సీబీకి..:
వ్యాట్‌ను, నన్ను ఎందుకు కాపీ కొడుతున్నావని అలెగ్జెండ్రా హార్ట్‌లీ ప్రశ్నించగా.. నేనేం మిమ్మల్ని కాపీ కొట్టడం లేదు, వికెట్ కీపర్ కోసం ఆర్‌సీబీకి మద్దుతనిస్తున్నా అని చెప్పింది. అసలు విషయం గుర్తు రాగానే అలెగ్జెండ్రా కూడా సారీ మర్చిపోయాను. నువ్వు తప్పకుండా నీ జట్టుకే సపోర్ట్ చేయాలంటూ ట్వీట్ చేసింది.

డికాక్, సారా టేలర్ ఒకే పోలికలతో:
అసలు విషయం ఏంటంటే.. వీరిద్దరూ దాదాపుగా ఒకే పోలికలతో ఉంటారు. ఇద్దర్నీ పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. దీంతో తన పోలికలతో ఉన్న డికాక్ కోసం ఆర్‌సీబీకి సపోర్టు చేస్తున్నానని టేలర్ చెప్పింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications