Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరోసారి వార్తల్లో శుభ్‌మన్‌-సారా.. ఇద్దరిమధ్య సంథింగ్.. సంథింగ్!!

Sara Tendulkar, Shubman Gill Post Same Captions; Netizens Troll Him Online

ముంబై: ప్రపంచంలో క్రికెటర్లకు ఉండే క్రేజే వేరు. ఇక ఆ ఆటగాళ్లు ఓ సెలబ్రిటీ అమ్మాయిలతో కలిసి మాట్లాడితే, సోషల్‌ మీడియా ఖాతాల్లో ఒకే తరహాలో పోస్టులు చేస్తే ఇంకేమన్నా ఉందా?.. ఇద్దరిమధ్య సంథింగ్.. సంథింగ్ అని గుసగుసలు వినిపిస్తాయి. ప్రస్తుతం టీమిండియా యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ మధ్య ఇలాంటి గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఎదో ఉందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. విషయంలోకి వెళితే...

ఐ‌ స్పై

ఐ‌ స్పై

శుభ్‌మన్‌ గిల్‌, సారా టెండూల్కర్ సామాజిక మాధ్యమాల్లో చాలాకాలంగా ఒకరినొకరు అనుసరిస్తున్నారు. ఇద్దరు అనేక విషయాల్లో కామెంట్లు పెడుతున్నారు. తాజాగా శుభ్‌మన్‌ ఇన్‌స్టాలో ఓ అందమైన ఫొటో పోస్ట్‌ చేశాడు. మనోహరమైన ప్రదేశంలో బెంచ్‌పై కూర్చొని.. కాలుమీద కాలువేసుకుని ఉన్నాడు. ఆ ఫోటోకి 'ఐ‌ స్పై‌' అని కాప్షన్ పెట్టాడు. రెండు ఎమోజీ (కళ్లు)లను కూడా జత చేశాడు. మరోవైపు అదేసమయానిక్ సారా కూడా తన అందమైన ఫొటో పెట్టి 'ఐ‌ స్పై‌' అని పోస్ట్‌ చేయడమే కాకుండా అవే ఎమోజీలను కూడా పెట్టారు.

ఇద్దరిమధ్య సంథింగ్.. సంథింగ్

ఇద్దరిమధ్య సంథింగ్.. సంథింగ్

శుభ్‌మన్‌ గిల్‌, సారా టెండూల్కర్ పోస్ట్ చేసిన ఫొటోలు వారి వ్యక్తిగతమైనవే అయినప్పటికీ ఒకే సమయంలో ఒకే తరహా వ్యాఖ్య పెట్టడంతో.. మళ్లీ అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఇద్దరిమధ్య సంథింగ్.. సంథింగ్ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరు నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు కాబట్టి అలా పోస్ట్ చేసారు అని కొందరు నెటిజన్లు అంటుంటే.. గిల్‌-సారా‌ ఏం జరుగుతోంది మీ మధ్య అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. శుభ్‌మన్‌-సారా ఇద్దరిలో ఎవరు ఎవరిపై నిఘా పెట్టారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. మొత్తానికి ఇన్‌స్టా పోస్ట్ పుణ్యమా అని శుభ్‌మన్‌-సారా మరోసారి వార్తల్లో నిలిచారు.

ఫొటో ఎడిటింగ్‌ స్కిల్స్

ఫొటో ఎడిటింగ్‌ స్కిల్స్

ఆ మధ్య శుభ్‌మన్‌ గిల్‌ తనలోని ఫొటో ఎడిటింగ్‌ స్కిల్స్‌ను అభిమానులకు పరిచయం చేసాడు. ఓ ఫొటోలో బ్యాగ్రౌండ్‌ ఒకే విధంగా కనబడేలా.. ఓవైపు వర్క్‌ అవుట్స్‌ చేస్తున్నట్టు, మరోవైపు కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతున్నట్టు ఎడిటింగ్‌ చేశాడు. ఈ ఫొటోను శుభ్‌మన్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసి.. 'ఒకరు పనిపై శ్రద్ద చూపిస్తుంటే.. మరొకరు చిల్ అవుతున్నారు' అని కామెంట్ పెట్టాడు. అప్పడు సారా.. గిల్‌ ఎడిటింగ్‌ స్కిల్స్‌పై కామెంట్ చేసారు. 'ఆ ఎడిటింగ్‌ అతనే చేశారని భావిస్తున్నారా?' అంటూ కామెంట్‌ చేశారు. ఆ కామెంట్ కారణంగా శుభ్‌మన్‌, సారా వార్తల్లో నిలిచారు. ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు అప్పుడే మొదలయ్యాయి.

సారా అభినందనలు

సారా అభినందనలు

గతేడాది గిల్‌ ఓ కారుకొంటే అందుకు సారా అభినందనలు తెలియజేసారు. అప్పుడు వెంటనే 'నీ బదులు సారాకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను బ్రో' అని గిల్‌ను హార్దిక్‌ పాండ్యా కవ్వించాడు. సారా వయసు 22 కాగా.. శుభ్‌మన్‌ వయసు 20. శుభ్‌మన్‌ గిల్‌ 2018 అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో అత్యధిక పరుగులు (372) చేసి 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న అతడికి గతేడాది టీమిండియాలో అవకాశం వచ్చింది. న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికై ఒక మ్యాచ్‌ ఆడాడు. తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైనా ఆడే అవకాశం దక్కలేదు.

Story first published: Friday, July 31, 2020, 14:08 [IST]
Other articles published on Jul 31, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+